Prabhas's The Raja Saab Event Speech Highlights : ఆయన పాన్ ఇండియా స్టార్... మూడేళ్ల తర్వాత అభిమానుల ముందుకు వచ్చారు. స్టేజ్‌పై డైరెక్టర్ ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టుకుంటే ఓదార్చారు. మూవీ టీంతో పాటు ఫ్యాన్స్‌కు ఓ ఎనర్జీ ఇచ్చారు. యాంకర్ సుమ దగ్గరి నుంచీ ఫ్యాన్స్ వరకూ అందరినీ తన స్పీచ్‌లో ప్రస్తావిస్తూ తనదైన జోష్‌తో స్పీచ్ ఇచ్చారు. 

Continues below advertisement

డార్లింగ్ స్పీచ్‌కు ఫిదా

'ది రాజా సాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డార్లింగ్ ప్రభాస్ స్పీచ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సంక్రాంతికి వచ్చే అన్నీ సినిమాలు హిట్ కావాలని... సీనియర్లు సీనియర్లేనంటూ ప్రభాస్ చెప్పిన మాటలు ఆడియన్స్ మనసు దోచేశాయి. 'సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ కావాలి. వెరీ ఇంపార్టెంట్. సీనియర్స్ సీనియరే. వారి దగ్గర నుంచే మేము నేర్చుకున్నాం. వారి తర్వాతే మేము. 100 శాతం సంక్రాంతికి అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్స్ కావాలి. మాది కూడా అయిపోతే చాలా హ్యాపీ. లవ్ యూ డార్లింగ్స్.' అంటూ చెప్పారు.

Continues below advertisement

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మా డార్లింగ్ ప్రభాస్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని... ఆయన స్పీచ్ వింటుంటే సీనియర్లు, ఇతర యాక్టర్స్‌పై ఆయనకున్న రెస్పెక్ట్ ఏంటో అర్థమవుతోందని అంటున్నారు. 

Also Read : స్టేజ్‌పై కోలీవుడ్ స్టార్ విజయ్ డ్యాన్స్ - ఫ్యాన్స్ ఫుల్ జోష్... TVK నినాదాలపై వారించిన దళపతి

షాక్ అవుతారు

ఇక ఈ మూవీ జర్నీని తలుచుకుంటూ డైరెక్టర్ మారుతి ఎమోషన్‌తో కన్నీళ్లు పెట్టుకోగా ప్రభాస్ స్వయంగా స్టేజ్‌పైకి వెళ్లి ఆయన్ను హగ్ చేసుకుని ఓదార్చారు. ఆ తర్వాత 'డార్లింగ్ క్లైమాక్స్ పెన్‌తో రాశావా మెషీన్ గన్‌తో రాశావా' అంటూ నవ్వులు పూయించారు. ఈ సీన్‌కు ఫ్యాన్స్‌తో పాటు మూవీ టీం సైతం ఫిదా అయిపోయింది. ఇక ఫ్యాన్స్‌ను ఉద్దేశించి కొన్ని కామెడీ సెటైర్లు వేశారు. 'బాహుబలి జయహో' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేయడంతో ఏం నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందా? అని ప్రశ్నించారు.

'నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందని బాహుబలి జయహో అంటున్నారు కదా? ఒక రోజు ఎంటర్టైన్ చేస్తా స్టేజీ మీద. మీరంతా షాక్ అయిపోతారు.' అంటూ చెప్పారు. దీంతో ఆడియన్స్ కేకలతో వేదిక దద్దరిల్లింది.