Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్‌' సక్సెస్‌ మీట్‌ - స్టేజ్‌పై అనుపమకు అవమానం, హీరోయిన్‌ని అలా కించపరచడమేంటి?

Anupama Parameswaran: టిల్లు స్క్వేర్‌ సక్సెస్‌ మీట్‌లో అనుపమకు అవమానం ఎదురైంది. స్టేజ్‌పై మాట్లాడుతుండగా అభిమానుల తీరుతో ఆమె నొచ్చుకున్న ఆమె స్టేజ్‌ దిగి వెళ్లిపోయింది.. కానీ, సుమ కలుగజేసుకుని

Continues below advertisement

Anupama Parameswaran Insulted at Tillu Square Success Meet: టిల్లు స్క్వేర్‌ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీ వందకోట్ల క్లబ్‌లో చేరిన నేపథ్యంలో గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సక్సెస్‌ మీట్‌కు గ్లోబల్‌ స్టార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ హజరయ్యారు. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ కూడా హజరయ్యారు. ఇక ఈ మూవీ హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్‌, నేహా శెట్టిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పైకి వచ్చిన అనుపమకు ఈ వెంట్‌లో ఘోర అవమానం ఎదురైంది. ఆమె మాట్లాడుతుండగా నందమూరి ఫ్యాన్స్‌ తీరు ఆమె ఇబ్బంది పడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Continues below advertisement

కాగా సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'టిల్లు స్కేర్‌'. 'డీజే టిల్లు'కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది.   మార్చి 29న విడుదలైన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాకబస్టర్‌ హిట్‌ సాధించింది. విడుదలైన అన్ని చోట్ల హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది. సిద్ధు తనదైన డైలాగ్‌ డెలివరి, కామెడీ టైమింగ్‌తో ఆకటత్టుకున్నాడు. దీంతో ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టారు. ఫలితంగా 'టిల్లు స్క్వేర్‌'9 రోజుల్లోనే వందకోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. మూవీ బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడం మేకర్స్‌ గ్రాండ్‌ సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ సక్సెస్‌ మీట్‌లో అనుపమకు అభిమానుల నుంచి ఊహించని సంఘటన ఎదురైంది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతుండగా వద్దు వద్దు అంటూ నందమూరి ఫ్యాన్స్‌ గోల చేశారు.

రిక్వెస్ట్ చేసిన పట్టించుకోలేదు..

ఆమె మాట్లాడుతుంటే కనీసం పట్టించుకోకుండా అరుస్తూనే ఉన్నారు. వారిని గమనించిన అనుపమ వద్దా మాట్లాడొద్దా? వెళ్లిపోనా? అని అడిగింది. దానికి వారు సరే అంటూ తల ఊపారు. కనీసం అనుపమ మాట్లాడేందుకు చాన్స్‌ కూడా ఇవ్వలేదు. దీంతో ప్రేక్షకుల తీరు చూసి అనుపమ కాస్తా నొచ్చుకున్నట్టు కనిపించింది. సరే వెళ్లిపోతానంటూ స్టేజ్‌ తిగబోతుండగా.. హోస్ట్‌ సుమ పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేసింది. హీరోయిన్ మీరూ మాట్లాడాల్సిందే అంటూ అనుపమతో మాట్లాడించింది. అయినా ఆడియన్స్‌ అసలు వినిపించుకోలేదు గోల గోల చేస్తూనే ఉన్నారు. సరే ఒక రెండు నిమిషాలు మాట్లాడోచ్చా అని రిక్వెస్ట్‌గా చేసినా.. ఫ్యాన్స్‌ వారి తీరు మార్చుకోలేదు.

సరే ఒక్క నిమిషాం మాట్లాడతానంటూ తన స్పీచ్‌ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా ముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. మీ ఎమోషన్‌ని అర్థం చేసుకోగలను. నాకు ఏం బాధలేదు. మీ అత్యుత్సాహం అర్థమైంది. మీ స్థానంలో నేను ఉన్న అలాగే ప్రవర్తిస్తాను. మీ అందరికి థ్యాంక్స్‌" అంటూ ముగించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతున్నాయి. ఇది చూసి అంతా వారి తిరుని తప్పుబడుతున్నారు. ఆమె ఒక హీరోయిన్‌.. మాట్లాడద్దు అంటూ అలా గోల చేయడం కరెక్ట్‌ కాదని, అది ఆమెను కించపరిచనట్టే అవుతుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Also Read: నీ భర్తను ఎందుకు మోసం చేశావ్‌? - నెటిజన్‌ ప్రశ్నకి సమంత స్ట్రాంగ్‌ కౌంటర్‌, ఏమన్నదంటే!

Continues below advertisement