Fahadh Faasil Joins Rajinikanth's Jailer 2 Movie Shooting: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా 'జైలర్ 2' (Jailer 2) కూడా తెరకెక్కుతోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. 

సూపర్ కాంబో రిపీట్?

ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో 'ఫహాద్ పాజిల్' కూడా నటిస్తున్నారని.. ఆయన షూటింగ్‌లో జాయిన్ అయ్యారనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. గతంలో రజినీతో కలిసి ఫహాద్ వేట్టయాన్‌లో నటించారు. ఇప్పుడు అదే కాంబో రిపీట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి కమర్షియల్‌గా 'వేట్టయాన్' అంతగా సక్సెస్ కాకపోయినా వీరిద్దరి మధ్య వచ్చిన సీన్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. 'జైలర్ 2'లో ఫహాద్ నెగిటివ్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే, మూవీ టీం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ మూవీలో రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. తమిళ స్టార్ ఎస్ జే సూర్య ఈ మూవీలో విలన్‌గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: హిట్ 3 షూట్​లో చేయి కట్​ అయినా ప్యారడైజ్ లుక్​ కోసం నాని ఫాలో అయిన డైట్, ఫిట్​నెస్ సీక్రెట్స్ ఇవే

రజినీకాంత్ 'జైలర్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కురిపించింది. సుమారు రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఇప్పుడు అదే జోష్‌లో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. 'జైలర్'లో యాక్షన్ సీన్స్, రజినీ స్టైల్ మాస్ ఎలివేషన్స్ హైలెట్‌గా నిలవగా.. ఈ సినిమాలో అంతకు మించి ఉండేలా దర్శకుడు నెల్సన్ ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్

'జైలర్ 2' మూవీ షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కాగా.. ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చెన్నైలో జరిగింది. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. ఇక్కడ రజినీకాంత్, రమ్యకృష్ణ, మిర్నాలపై కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌లో గెస్ట్ రోల్స్‌లో చేసిన మోహన్ లాల్, శివరాజ్‌కుమార్ కూడా ఈ మూవీలో కొనసాగనున్నారు. జైలర్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ సీక్వెల్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వీడియోలో రజినీకాంత్ మాస్ ఎలివేషన్స్ మామూలుగా లేవు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'కూలీ' ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఓ కీలక రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ పూజా హెగ్డే ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు. గోల్ట్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రూపొందగా.. కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.