Eesha Rebba About Aravinda Sametha: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అంటే కచ్చితంగా ఇద్దరు హీరోయిన్లు ఉండాలి. అందులో ఒక హీరోయిన్‌కు చిన్న రోల్ ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రేక్షకులు ఉండిపోయారు. ఇప్పటివరకు త్రివిక్రమ్ తెరకెక్కించిన చాలావరకు సినిమాల్లో ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. అదే విధంగా ఎన్‌టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘అరవింద సమేత’లో కూడా ఈషా రెబ్బను సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్నారు. అందులో ఈషా.. పూజా హెగ్డే చెల్లెలిగా నటించింది. పైగా అందులో తన స్క్రీన్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంత చిన్న పాత్ర చేయడానికి ఎందుకు ఒప్పుకోవల్సి వచ్చిందనే విషయాన్ని
రిస్క్ అనుకున్నాను..
‘‘ఈ విషయంపై నేను చాలా క్లియర్‌గా ఉండాలి అనుకుంటున్నాను. ‘అరవింద సమేత’కు ముందు నేను పెద్ద సినిమాలు ఏమీ చేయలేదు. నేను అప్పట్లో అంత పెద్ద స్టార్ కాదని, నాకు అంత సీన్ ఏం లేదని నేను అనుకుంటున్నా. దానికి ముందు నేను పెద్ద సినిమా చేయకపోవడం వల్ల అసలు ఒక పెద్ద సెట్‌నే నేనెప్పుడూ చూడలేదు. బస్ డిపోలాగా లైన్‌గా క్యారవ్యాన్‌లను కూడా ఎప్పుడూ చూడలేదు. నాకు అదంతా కొత్తగా అనిపించింది. ‘అరవింద సమేత’ కథతో త్రివిక్రమ్, నాగవంశీ నన్ను అప్రోచ్ అయ్యారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని అప్పుడే చెప్పారు. రిస్క్ ఏమో అనుకొని.. వద్దులేండి అన్నాను. తారక్, త్రివిక్రమ్ ఉన్నారు అయినా ఏంటి ప్రాబ్లమ్ అని అడిగారు. నన్ను నేను లీడ్‌గా చూసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను’’ అంటూ ముందుగా ‘అరవింద సమేత’ను రిజెక్ట్ చేసినట్టు బయటపెట్టింది ఈషా.
ఎక్కడో కొడుతుంది..
‘‘త్రివిక్రమ్ వచ్చి అరగంట పాటు కథ మొత్తం చెప్పారు. నీ క్యారెక్టర్ కూడా లీడ్ లాంటిదే అన్నారు. అయినా కూడా ఎక్కడో కొడుతుంది అనుకున్నాను. ఫైనల్‌గా ఒకసారి చేసి చూద్దాంలే అని ఓకే సార్ అని చెప్పాను. ఆ తర్వాత రోజే షూటింగ్ మొదలయ్యింది. ఒక సాంగ్ షూటింగ్ కూడా ఉంది కానీ అది జరగలేదు. సెట్‌లో అంతా బాగుండేది, తారక్ ఎనర్జీ అద్భుతం, త్రివిక్రమ్ డైరెక్షన్.. అన్నీ ప్లానింగ్ ప్రకారం ఉండేవి. ఆ సినిమా కోసం బైక్ కూడా నేర్చుకున్నాను. దాంతో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చింది ఈషా రెబ్బ. తను ‘అరవింద సమేత’లో నటిస్తున్నాననే వార్త బయటికి రాగానే తెలియనివాళ్లు కూడా ఫోన్లు చేసేవాళ్లని, టచ్‌లో ఉండడానికి ప్రయత్నించేవాళ్లని తెలిపింది.
అన్నీ జరగలేదు..
‘‘అరవింద సమేత ముందు వరకు పెద్ద సినిమాల గురించి నాకేం ఐడియా లేదు. కొన్నిరోజుల తర్వాత సినిమా చూశాను. ఎక్స్‌ట్రా సీన్స్ అన్నీ కట్ చేసేశారు. ఒకసారి సాంగ్ షూటింగ్ ఉందని వెకేషన్ క్యాన్సల్ చేసుకొని వచ్చాక షూటింగ్ క్యాన్సల్ అన్నారు. సెకండ్ లీడ్‌గా అనౌన్స్ చేస్తానన్నారు అది కూడా జరగలేదు. అలా చేస్తే నాకు హెల్ప్ అయ్యేది. సినిమా రిలీజ్ అయ్యాక నాకు సంతోషంగా అనిపించలేదు. బాధగా అనిపించింది. పెద్దవాళ్లతో కలిసి పనిచేశాను అని మాత్రమే సంతోషంగా ఉంది. పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నా అని నేను డబ్బా కొట్టుకోలేదు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక చాలామంది ఫోన్లు చేసి మీదేం లేదు అన్నారు. నెగిటివ్ విషయాలు పక్కన పెడితే ‘అరవింద సమేత’ వల్ల నాకు తెలుగమ్మాయి అని పాపులారిటీ వచ్చింది’’ అని చెప్పింది ఈషా రెబ్బ.
Also Read: మళ్లీ మొదలైన సుచీ లీక్స్ వివాదం - కమల్ హాసన్‌పై సింగర్ సుచిత్ర సంచలన ఆరోపణలు, ఫ్యాన్స్ ఫైర్