DVV Entertainments Denies Rumours About Advance To Prasanth Varma : ఫస్ట్ మూవీ 'హను మాన్'తో బిగ్ సక్సెస్ అందుకుని పాన్ ఇండియా స్థాయి డైరెక్టర్‌గా మారారు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్ చేసి 'మహాకాళి' మూవీ చేస్తున్నారు. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా... పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక 'జై హనుమాన్' మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
'హనుమాన్' రిలీజై రెండేళ్లు పూర్తి కాగా ఆ సక్సెస్ తర్వాత ప్రశాంత్ వర్మకు టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థల నుంచి వరుస ఆఫర్స్ వచ్చాయట. వీరి నుంచి అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అలా దాదాపు రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ అడ్వాన్సులు తీసుకున్నారని... ఈ డబ్బుతో హైదరాబాద్‌లో సొంతంగా ఓ స్టూడియోను కూడా నిర్మించుకుంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అయితే, నిర్మాతలు మూవీస్ గురించి అడిగే సరికి... స్టోరీ, దర్శకత్వం పర్యవేక్షణ చేస్తాను తప్ప డైరెక్షన్ చేయనని అంటున్నారట. దీంతో ఆయనపై ఫిలించాంబర్‌కు కంప్లైంట్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
'డీవీవీ ఎంటర్టైన్మెంట్స్' రియాక్షన్
అయితే, ప్రశాంత్ వర్మకు అడ్వాన్సులు ఇచ్చారంటూ వచ్చిన నిర్మాణ సంస్థల జాబితాలో 'డీవీవీ ఎంటర్టైన్మెంట్స్' కూడా ఉండడంతో ఆ సంస్థ రియాక్ట్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. 'డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఏ ప్రాజెక్ట్ కోసం కూడా అడ్వాన్స్ ఇవ్వలేదు. మాకు, దర్శకుడికి మధ్య వ్యాపారపరమైన ఒప్పందాలు జరగలేదు. ఏదైనా వార్తను ప్రచారం చేసే ముందు అందులో నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నాం. ఇలాంటి వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.' అంటూ స్పెషల్ నోట్ రిలీజ్ చేసింది.
Also Read : ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్! - 17 ఏళ్లకే వదిలేసి వెళ్లిపోవాలనుకున్నా... హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
ఇక, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో ఆరు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని గతంలో తెలిపారు. ఇందులో భాగంగా 'మహాకాళీ', 'అధీర'లను అనౌన్స్ చేశారు. ఈ యూనివర్స్ నుంచి ప్రతీ ఏడాది ఒక సినిమా రిలీజ్ అవుతుందని చెప్పారు. తాజాగా, రిలీజ్ చేసిన 'మహాకాళి' ఫస్ట్ లుక్ వేరే లెవల్‌లో ఉంది. ఇందులో భూమి శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.