కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. #KH 234 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా మొదలైన ఈ మూవీకి సంబంధించి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. నవంబర్ 7న కమలహాసన్ బర్త్ డే కావడంతో ఒక్కరోజు ముందుగానే సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించే ఇద్దరి నటీ నటుల వివరాలను మేకర్స్ పోస్టర్స్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇంతకీ ఆ నటీ నటులు ఎవరు? డీటెయిల్స్ లోకి వెళితే.. మణిరత్నం కమలహాసన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'నాయకుడు' మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.


1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓ క్లాసిక్ మూవీగా నిలిచింది. మళ్లీ 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరి కలయికలో ఓ సినిమా రూపొందుతోంది. #KH 234 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ పతాకాలపై కమలహాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్ర, శివ అనంత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఇదిలా ఉంటే నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో ఒక్కరోజు ముందుగానే ఈ మూవీ నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించారు. తాజాగా మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో భాగమైనట్లు మేకర్స్ వెల్లడించారు.






ఈ మేరకు దుల్కర్ కి సంబంధించిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో దుల్కర్ పాత్ర కీలకంగా ఉండనున్నట్లు కలుస్తోంది. దుల్కర్ సల్మాన్ సైతం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ..' మణిరత్నం సర్, కమల్ సార్ సినిమాలో భాగం అవ్వడం ఎంతో ఆనందంగా ఉందని' పేర్కొన్నాడు. దుల్కర్ సల్మాన్ తో పాటు చెన్నై  స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతుంది. తాజాగా ఆమెకు సంబంధించిన పోస్టర్ ని సైతం రిలీజ్ చేస్తూ #KH 234 లో త్రిష భాగమైనట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. మరోవైపు కమలహాసన్ బర్త్ డే సందర్భంగా ఈ ప్రాజెక్టు నుంచి సాయంత్రం 5 గంటలకు టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు సర్ప్రైజ్ వీడియో సైతం విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.






టైటిల్ అండ్ సర్ప్రైజ్ వీడియో కోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హీట్ తర్వాత కమలహాసన్ చేస్తున్న సినిమా కావడం, రీసెంట్ గా 'పొన్ని యన్ సెల్వన్' తో దర్శకుడిగా మణిరత్నం భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ ఇద్దరు దిగ్గజాలు సుమారు మూడు దశాబ్దాల తర్వాత కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, శర్మిష్టా రాయ్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు.


Also Read : రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సాంగ్ లీక్ - ఇద్దరు అరెస్ట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial