Lucky Baskhar Release Date: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ వివిధ భాషలలో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ఓకే బంగారం' అనే డబ్బింగ్ మూవీతో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకున్న దుల్కర్.. 'మహానటి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో నేరుగా టాలీవుడ్ లో అడుగుపెట్టారు. 'సీతా రామం' సినిమాతో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల 'కల్కి 2898 AD' లో క్యామియోతో సర్ప్రైజ్ చేసారు. ఇప్పుడు 'లక్కీ భాస్కర్' అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అయితే తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారు. 


'లక్కీ భాస్కర్' సినిమాని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తెలుగు, మలయాళం, తమిళం, హిందీ భాషల్లోప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. బిగ్ స్క్రీన్‌లపై లక్కీ బాస్కర్ మరపురాని ప్రయాణాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఓ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఇందులో దుల్కర్ సల్మాన్ ఫార్మల్ డ్రెస్ లో క్లాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 






1980-90స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన వైవిధ్యమైన పీరియాడిక్ డ్రామా 'లక్కీ భాస్కర్'. అసాధారణ స్థాయికి చేరుకున్న ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు డైరెక్టర్ వెంకీ అట్లూరి. దీని కోసం నిర్మాతలు హైదరాబాద్‌లో 80ల నాటి ముంబై నగరాన్ని తలపించే భారీ సెట్స్ నిర్మించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 'శ్రీమతి గారు' అనే ఫస్ట్ సింగిల్ కూడా సంగీత ప్రియులను అలరించింది. 


'లక్కీ భాస్కర్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. బంగ్లాన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసారు. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మేకర్స్ రెడీ అయ్యారు. జులై 28న హీరో దుల్కర్ సల్మాన్ బర్త్ డే స్పెషల్ గా ఏదైనా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి. 'సార్' తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ అట్లూరి.. ఈసారి దుల్కర్ తో కలిసి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి. 


Also Read: బిగ్ బాస్ బ్యూటీతో రాజ్ తరుణ్‌కు అఫైర్ - సంచలన ఆరోపణలు చేసిన లావణ్య