Doctor Liver Doc Apologizes to Samantha Ruth Prabhu: సమంతకు డాక్టర్ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల సమంత పెట్టిన డాక్టర్ లివర్ డాక్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం ఉంటుందని సూచిస్తూ పోస్ట్ షేర్ చేసింది. దీనిపై డాక్టర్ లివర్ డాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజల ఆరోగ్యంతో సమంత ఆటాడుతుందంటూ మండిపడ్డారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని లేదని ఆయన హెచ్చరించారు.
సమంత చెప్పినట్టు చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇలాంటి సలహాలు ఇస్తున్న ఆమెను జైళ్లో పెట్టాలంటూ మాటల దాడి చేశారు. అతడి వ్యాఖ్యలపై సమంత స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆయనకు ఒక డాక్టర్, ఆయన చెప్పినదాంట్లో నిజం ఉందని నేను నమ్ముతాను. కానీ, అతడు ఉపయోగించిన పదజాలం నన్ను బాధించాయి. ముఖ్యంగా నన్ను జైల్లో పెట్టాలన్న పెట్టాలనడంతో బాధకలిగించిందని సామ్ తన పోస్ట్‌లో పేర్కొంది.
అది నా ఉద్దేశం కాదు
ప్రస్తుతం చికిత్సలు అధిక ఖర్చుతో కూడుకున్నవి.. అందరికి ఆ స్థోమత ఉండదు. అలాంటి వారికి ఇలాంటి సంప్రదాయమైన చికిత్స ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే తాను ఆ ప పోస్ట్ చేశానని స్పష్టం చేసింది. అంతేకాదు తన మయోసైటిస్ కారణంగా ఎన్నో రకాల జౌషధాలు తీసుకున్నానని, ఎంతో నిపుణ వైద్యులు చెప్పినవన్ని ట్రై చేశానని తెలిపింది. అందులో తానకు మంచివి అనిపించినవి, ఇతరులకు మార్గనిర్దేశకంగా ఉంటాయనే తాను చెప్పానని, అంతేకాని వాటి నుంచి తాను ఎలాంటి లాభం పొందడం లేదని స్పష్టం చేసింది. సమంత పోస్ట్‌పై డాక్టర్ లివర్ డాక్ తాజాగా స్పందించారు.
తన మాటల వల్ల సమంత చాలా బాధపడ్డారని, ఇందుకు తనని క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. కానీ సమంతకు వైద్యం చేసిన డాక్టర్లను ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్ షేర్ చేశారు. "నేను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఆమె ఆరోగ్యంపై షేర్ చేసిన పోస్ట్‌ను నేను ఖండించాను. ఈ క్రమంలో నేను వాడిని పదజాలం ఆమెకు బాధపెట్టింది. ఇందుకు ఆమెను క్షమాపణలు కోరుతున్నాను. కానీ అవి నేను కావాలని చేసినవి కాదు. అనుకోకుండ అలా జరిగింది. ఆమెను విమర్శించడం నా ఉద్దేశం కాదు. నిజానికి అది సమంత తప్పు కాదు. ఆమెకు ఆ చికిత్స చెప్పిన డాక్టర్‌ది.
అతడి సొంత లాభం కోసం సమంత స్టార్ డమ్‌ని ఉపయోగించుకున్నాడు. సమంత లాంటి సెలబ్రిటీల ద్వారా హనికరమైన సమచారాన్ని ప్రజలకు ప్రచారం చేయిస్తున్నారు. దీనిని మాత్రమే నేను ఖండించాను" అని ఆయన వివరణ ఇచ్చారు. ఇక సమంతకు ఆ వైద్యం చెప్పిన డాక్టర్‌పై డాక్టర్ లివర్ డాక్ సంచలన ఆరోపణలు చేశారు. సమంతకు వైద్యం అందించిన అతడు ఎంబీబీఎస్ డాక్టర్ కాదని, అతను ప్రకృతి వైద్యుడు అని చెప్పారు. ఇప్పటికే ఆయనపై పలు కేసులు ఉన్నాయని, గతంలో ఆరోగ్యానికి హాని కలిగించే పలు ఉత్పత్తులను ప్రొత్సహించినందుకు ఆయనపై ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుందంటూ లివర్ డాక్ సంచలన కామెంట్స్ చేశారు.
Also Read: రాజ్ తరుణ్ - లావణ్య కేసు - స్పందించిన మాల్వీ మల్హోత్రా, ప్రియురాలిపై పోలీసులకు ఫిర్యాదు