Divyendu Look From Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబో మోస్ట్ అవెయిటెడ్ మూవీ 'పెద్ది'. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మీర్జాపూర్ ఫేం 'దివ్యేందు శర్మ' కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బర్త్ డే సందర్భంగా మూవీ టీం స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
లుక్ రివీల్
ఈ సినిమా నుంచి దివ్యేందు లుక్ రివీల్ చేశారు మేకర్స్. కాస్త గుబురు గెడ్డంతో మాస్ రగ్డ్ లుక్‌లో అదరగొట్టారు. ''రామ్ బుజ్జి'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. రామ్ బుజ్జి పెద్ది గ్రామీణ ప్రపంచం నుంచి వచ్చిన అత్యంత ఆసక్తికరమైన పాత్రల్లో ఒకటి.' అంటూ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెప్పారు.
Also Read: రొమాంటిక్ హారర్ కామెడీనా.. ఎమోషనల్ మూవీనా? - 'ది రాజా సాబ్' స్టోరీపై క్లారిటీ ఇచ్చిన మారుతి
శరవేగంగా షూటింగ్
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 30 శాతం పూర్తి కాగా.. రామ్ చరణ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ ట్రైన్ సెట్ వేశారు. అందులో యాక్షన్ సీక్వెన్స్ మూవీకే హైలెట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీ చరిత్రలో ఇప్పటివరకూ ఎవరూ అటెంప్ట్ చేయని విధంగా.. హై రిస్క్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తైన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకూ రామ్ చరణ్, దివ్యేందు శర్మలపై మాత్రమే యాక్షన్ సీన్స్, ఇతర పార్ట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్, రామ్ చరణ్‌పై రొమాంటిక్, లవ్ సీన్స్ షెడ్యూల్‌ను త్వరలోనే తీయనున్నారనే టాక్ వినిపిస్తోంది.
గ్లింప్స్ వేరే లెవల్ అంతే..
చరణ్ బర్త్ డే సందర్భంగా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ట్రెండింగ్‌లో నిలిచింది. విలేజ్ బ్యాక్ డ్రాప్, క్రికెట్ నేపథ్యంలో మూవీ తెరకెక్కుతుండగా.. చరణ్ సిగ్నేచర్ షాట్ భారీ హైప్ క్రియేట్ చేసింది. చరణ్ మాస్, రగ్డ్ లుక్‌లో ఆకట్టుకోగా.. మూవీ ఎలా ఉండబోతుందోననే ఇంట్రెస్ట్ నెలకొంది.
వచ్చే ఏడాది రిలీజ్..
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. చరణ్ సరసన అందాల నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా.. జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, అర్జున్ అంబటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.