Director Maruthi Reaction On Prabhas The Raja Saab Story: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ టీజర్ ట్రెండ్ సృష్టించిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్‌ను చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. రొమాంటిక్ కామెడీ హారర్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. తాజాగా స్టోరీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ మారుతి.

హారర్ ఫాంటసీ ఫిల్మ్.. కానీ

'ది రాజా సాబ్' మూవీ ఒక ఎమోషనల్ స్టోరీ అని.. ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారని చెప్పారు మారుతి. ఇండియన్ స్క్రీన్స్‌పై ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకూ రాలేదన్నారు. 'ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఫిల్మ్‌గా ఈ మూవీ సిద్ధమవుతోంది. ఎమోషనల్ ఫిల్మ్ కూడా. ఎన్నో ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. తాతయ్య, నానమ్మ, మనవడి స్టోరీని ఇందులో చూపించనున్నాం. స్క్రీన్‌పై చూసిన తర్వాత ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు.' అని మారుతి తెలిపారు.

ప్రభాస్ క్రేజ్.. ఆ మాత్రం ఉండాలిగా..

ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని.. స్టోరీకి అనుగుణంగా భారీ సెట్స్ వేశామని మారుతి తెలిపారు. ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగానే హవేలీ రాజ్‌మహల్ సెట్, వీఎఫ్ఎక్స్ వర్క్‌పై దృష్టి పెట్టినట్లు చెప్పారు. 'చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఎక్కడా బడ్జెట్ విషయంలో వెనుకాడడం లేదు. రియాలిటీకి వీఎఫ్ఎక్స్‌ను జోడించాలనేదే మా ఉద్దేశం. పూర్తిస్థాయిలో ఓ కల్పిత ప్రపంచాన్ని సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆడియన్స్‌కు అద్భుతమైన చిత్రాన్ని అందించేందుకు ప్రభాస్ ఎంతో కష్టపడుతున్నారు.' అని మారుతి తెలిపారు.

Also Read: చిరంజీవి ‘చంటబ్బాయ్’, కీర్తి సురేష్ ‘మహానటి’ to రవితేజ ‘కృష్ణ’, అల్లు అర్జున్ ‘దేశముదురు’ వరకు - ఈ గురువారం (జూన్ 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

ఓ రాజమహల్‌లో చనిపోయిన తర్వాత కూడా తన సంపద కోసం పాకులాడే వృద్ధుని ఆత్మ.. ఆ సంపద కోసం మహల్‌కు వెళ్లిన వారు ఎదుర్కొన్న పరిణామాలు ఈ మూవీ స్టోరీ అని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. వీఎఫ్ఎక్స్, ప్రభాస్ లుక్‌తో లవ్, కామెడీ ట్రాక్ మూవీపై భారీగా హైప్ క్రియేట్ చేసింది. 3 గంటల నిడివితో మూవీ ఉంటుందని.. స్టోరీని సాగదీసి బలవంతంగా సీక్వెల్ చేసే ఉద్దేశం లేదని డైరెక్టర్ మారుతి ఇదివరకే స్పష్టం చేశారు. వీఎఫ్ఎక్స్ కోసమే దాదాపు 300 రోజులు కేటాయించామని.. క్లైమాక్స్ సీన్ మూవీకే హైలెట్‌గా నిలవనుందని అన్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయలేదని.. మా బ్యానర్‌లోనే ఇది భారీ ప్రాజెక్ట్ అని స్పష్టం చేశారు మారుతి.

డిసెంబర్ 5న రిలీజ్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ మూవీని నిర్మిస్తుండగా.. ప్రభాస్ సరసన మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. డిసెంబర్ 5న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.