Venky Atluri Revealed First Choice Of Sir Movie Lead Role: కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన 'సార్' మూవీ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. విద్యా వ్యవస్థలో లోపాలు కార్పొరేట్ దందా, ర్యాంకుల కోసం చేసే మోసాలు వంటి సెన్సిటివ్ అంశాలను మూవీలో అద్భుతంగా చూపించారు. అయితే, ఈ మూవీలో ఫస్ట్ హీరోగా రవితేజను అనుకున్నారట. 'మాస్ జాతర' ప్రమోషన్లలో భాగంగా రవితేజతో తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెంకీ అట్లూరి షేర్ చేసుకున్నారు.
అలా ధనుష్ ఎంట్రీ
కోవిడ్ కాలంలో రవితేజ అన్నకు ఫోన్ చేసి తాను 'సార్' కథ చెప్పానని... అయితే, ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారని చెప్పారు వెంకీ అట్లూరి. తాను ఎవరినీ వెయిట్ చేయాలని చెప్పనని రవితేజ చెప్పారని అన్నారు. ఆ తర్వాత మూడు నెలలకు ధనుష్‌కు కథ చెబితే ఓకే చెప్పారని... అలా 'సార్' మూవీ ట్రాక్ ఎక్కిందని వివరించారు. ధనుష్ హీరో అని తెలియగానే రవితేజ అన్న చాలా సంతోషించారని... వేరే ఆలోచన లేకుండా వెంటనే మూవీ చేయాలని సూచించినట్లు వెల్లడించారు.
మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫోన్ చేసి మూవీ చాలా బాగుందని చెప్పినట్లు తెలిపారు వెంకీ. 'తాను అయితే 'సార్' మూవీలో కరెక్ట్ కాదనే ఫీలింగ్ నాకు' అంటూ నవ్వులు పూయించారు రవితేజ.
Also Read: 60 కోట్లు దాటేశా 'డ్యూడ్' - బాక్సాఫీస్ వద్ద దీపావళి బొమ్మ బ్లాక్ బస్టర్
చాలా రోజుల తర్వాత మాస్ మహారాజ మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మూవీలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్స్ సాంగ్స్ మాస్ హైప్ క్రియేట్ చేశాయి. ఈ మూవీలో RPF ఆఫీసర్‌గా కనిపించనున్నారు. శ్రీకర స్టుడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై... సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. రవితేజ కెరీర్‌లో ఇది 75వ సినిమా కాగా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.