Mahesh Babu - Rajamouli Movie Update: ఇంకా సెట్స్‌పైకి రాకముందే రాజమౌళి-మహేష్‌ మూవీపై విపరీతమైన బజ్‌ నెలకొంది. ట్రిపుల్‌ ఆర్‌ ఆస్కార్‌ గెలిచిన నేపథ్యంలో మహేష్‌తో సినిమాను ప్రకటించాడు. SSMB29  అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. పాన్‌ వరల్డ్‌గా జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ అయిన ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. అంతగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ప్రాజెక్ట్‌ సెట్స్‌పైకి ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్‌ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'గుంటూరు కారం' కూడా రిలీజ్‌ అయ్యి రికార్డు వసూళ్లు దిశ దూసుకుపోతుంది.


దీంతో అంతా ఇప్పుడు మహేష్‌-జక్కన్న ప్రాజెక్ట్‌వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి తండ్రి, ప్రముఖ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌పై అప్‌డేట్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కి డబుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. ఇప్పటికే గుంటూరు సక్సెస్‌తో పండగ చేసుకుంటున్న సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కి ఈ నయా అప్‌డేట్‌ డబుల్‌ ట్రీట్‌ అనే చెప్పాలి. తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన విజయేంద్ర ప్రసాద్‌ కు ssmb29పై ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారాయన.


కథ అయిపోయింది.. ఇక అదే ఆలస్యం


మహేష్ బాబు కెరీర్లో ఇది 29వ సినిమాగా రాబోతోంది. ఇక బాహుల్‌, ట్రిపుల్‌ ఆర్‌ వంటి పాన్‌ ఇండియా చిత్రాల తర్వాత జక్కన్న ఈ సినిమాను ప్రకటించారు. దీంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ప్రకటించిన ఏడాదిన్నర అవుతుంది. ఇంకా సినిమా సెట్స్‌పైకే రాలేదు. నిజానికి ఈ ప్రాజెక్ట్‌ ప్రకటించిన తర్వాతే స్క్రిప్ట్‌పై వర్క్‌ చేసింది జక్కన్న టీం. ఏడాదికి పైగా కథపైనే ఫోకస్‌ పెట్టారు. ఇప్పుడు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని, ఇక సినిమా ప్రారంభం కావడమే ఆలస్యమంటూ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చారు ఈ మూవీ రైటర్‌ విజయేంద్రప్రసాద్‌.


తాజా ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. "ప్రస్తుతం మహేష్ బాబుతో కథ అయిపోయింది. రాజమౌళితో చేస్తున్నాము" అని ఆయన తెలిపారు. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత అటు రాజమౌళిగానీ, ఇటు విజయేంద్ర ప్రసాద్ గానీ మరో సినిమా చేయలేదు. మహేష్ సినిమాతోపాటు హిందీలో అజయ్ దేవ్‌గన్ మూవీ కూడా చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మూవీ ఒక యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కించనున్నట్టు జక్కన్న ఇప్పటికే వెల్లడించాడు. పాన్ ఇండియా కాదు ఈసారి పాన్ వరల్డ్ లెవల్లో తన సినిమా తీయాలని రాజమౌళి భావిస్తున్నాడు.


అటూ 'గుంటూరు కారం' మూవీ రిలీజ్‌ అవ్వడం, ఇటూ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కావడంతో త్వరలోనే SSMB29కి సంబంధించిన అప్‌డేట్‌ రానుందని తెలుస్తోంది. దీంతో తాజా అప్‌డేట్‌ చూసి మహేష్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ సినిమా కథకు సంబంధించి పూర్తి సమాచారం లేదు. కానీ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఇది ఇండియానా జోన్స్ స్టోరీలైన్ అని తెలుస్తోంది. భారత మూలాలతో ఉండబోయే జేమ్స్ బాండ్ లేదా ఇండియానా జోన్స్ లాంటి మూవీ అని రాజమౌళి కూడా టొరంటో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చెప్పాడు.


Also Read: అయోధ్య రామ మందిరానికి రూ.50 కోట్లు విరాళం ఇచ్చిన ప్రభాస్‌? నిజమెంతంటే!