Prabhas Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్‌కు కిర్రాక్ న్యూస్... 'కల్కి 2'పై నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Nag Ashwin confirms Jathi Ratnalu 2: జాతి రత్నాలు సీక్వెల్ కన్ఫర్మ్ చేశారు నాగ్ అశ్విన్. అలాగే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.

ఎప్పుడు? 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ (Kalki 2 Movie) చిత్రీకరణ చేసేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) అడుగు ముందుకు వేసేది ఎప్పుడు? కర్ణుడిగా ఆయన మళ్లీ వెండితెరపై కనిపించేది ఎప్పుడు? అభిమానులతో పాటు భారతీయ ప్రేక్షకులు అందరూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
'కల్కి 2898 ఏడీ'తో కంపేర్ చేస్తే ఎక్కువ స్క్రీన్ స్పేస్!
ప్రస్తుతం 'ఫౌజీ', 'ది రాజా సాబ్' సినిమాల చిత్రీకరణ చేస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ రెండిటి తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'స్పిరిట్' సెట్స్ మీదకు వెళుతుందని ఫిల్మ్ నగర్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి కల్కి సీక్వెల్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? అని కొంత మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు దర్శకుడు నాగ్ అశ్విన్ మంచి మాట చెప్పారు. ఈ ఏడాది (2025) ఆఖరిలో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన వివరించారు.
'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. దేశ విదేశాలలో కోట్లాది మంది ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా విజయం అభిమానులకు సంతోషాన్ని ఇచ్చినప్పటికీ... ఒక్క విషయంలో మాత్రం నిరాశ ఎదురైంది. సినిమాలో ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించే డ్యూరేషన్ చాలా తక్కువ అని ఫీల్ అయ్యారు. మరి సీక్వెల్ తీస్తే... అందులో ఎంత సేపు స్క్రీన్ మీద కనిపిస్తారు? అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. 'ఎవడే సుబ్రమణ్యం' పదేళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు మార్చి 21న రీ రిలీజ్ కానున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
''కల్కి 2898 ఏడీ'లో సుమతి పాత్రను పరిచయం చేయడం కోసం కొంత సమయం పట్టింది. అలాగే అశ్వత్థామ పాత్రను పరిచయం చేయడంతో పాటు మహాభారతాన్ని చెప్పాల్సి వచ్చింది. అందువల్ల ప్రభాస్ గారి స్క్రీన్ టైం కొంత తగ్గింది. కల్కి సీక్వెల్ వచ్చేసరికి భైరవ పాత్రతో పాటు కర్ణుడి క్యారెక్టర్ మెయిన్ ఉంటుంది. ప్రభాస్ గారి స్క్రీన్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది'' అని నాగ్ అశ్విన్ వివరించారు.
Also Read: రోత... చెత్త... లేకి... ఓటీటీ రిలీజ్‌లోనూ 'లైలా'ను వదలట్లేదు - ట్రోల్స్ షురూ
కుదిరితే 'కల్కి 2'కు ముందు 'జాతి రత్నాలు 2'!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ సినిమాలలో 'కల్కి' సీక్వెల్ (Kalki 2898 AD Sequel) కూడా ఒకటి. దీనికి డేట్స్ ఎప్పుడు ఇస్తారు? అనే సందేహం ఆ సినిమా అభిమానులలో ఉంది. అయితే ఈ ఇయర్ ఎండ్ సెట్స్ మీదకు సినిమా వెళుతుందని నాగ్ అశ్విన్ చెప్పారు. అంతే కాదు కుదిరితే మధ్యలో 'జాతి రత్నాలు' సీక్వెల్ (Jathi Ratnalu 2) కూడా ప్రొడ్యూస్ చేయాలని ఉందని ఆయన తన మనసులో కోరికను బయట పెట్టారు. మరి ముందుగా కల్కి 2898 ఏడీ సీక్వెల్ సెట్స్ మీదకు వెళుతుందో? జాతి రత్నాలు సీక్వెల్ ముందు సెట్స్ మీదకు వెళుతుందో? వెయిట్ అండ్ సీ.