Director Krish About Pawan Kalyan In Ghaati Promotions: స్వీటీ అనుష్క పవర్ ఫుల్ యోధురాలిగా 'ఘాటి'తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా... తాజాగా మూవీ ప్రమోషన్లలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. 

Continues below advertisement


రీసెంట్‌గా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూవీ 'హరిహర వీరమల్లు' మూవీని కొంత పార్ట్ క్రిష్ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకోగా ప్రొడ్యూసర్ ఎఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. రెండో పార్ట్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించనున్నారు. క్రిష్ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై అప్పట్లో ఎన్నో రూమర్లు వచ్చినా ఆయనతో పాటు నిర్మాత కూడా క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చారు క్రిష్.


పవన్ కల్యాణ్ అంటే లవ్


తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని... ఎఎం రత్నం అంటే అమితమైన గౌరవమని చెప్పారు క్రిష్. 'నాకు ప్రతీ సినిమా ఒక జర్నీ. హరిహర వీరమల్లు కొంత భాగం తీశాను. నాకు పవన్ కల్యాణ్ అంటే లవ్. చిన్నప్పుడే సూర్య మూవీస్‌లో పోస్టర్ చూసి నిర్మాత ఎఎం రత్నం గారితో వర్క్ చేయాలని అనుకున్నా. వారిని చూసి ఇన్ స్పైర్ అయినవాళ్లం. కొన్ని షెడ్యూల్ కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మేం స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ ఇతర కారణాల వల్ల అలా జరిగింది. ఆ సినిమాలో నా జర్నీ పూర్తి కాగా డైరెక్టర్ జ్యోతికృష్ణ కంటిన్యూ చేశారు. ప్రస్తుతం 'ఘాటి' మూవీ తీశాను. దీనిపై చాలా ఆసక్తిగా ఉన్నా. సెప్టెంబర్ 5న మీరు దాన్ని చూడబోతున్నారు.' అని స్పష్టం చేశారు.


Also Read: ధనుష్‌ను మించిన గొప్ప నటులు లేరు - 'అబ్దుల్ కలాం' బయోపిక్‌పై డైరెక్టర్ ఓం రౌత్ రియాక్షన్


'ఘాటి'లో అనుష్క... ఎందుకంటే?


'ఘాటి' మూవీలో అనుష్కను ఇంతకు ముందెన్నడూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో చూడబోతున్నట్లు చెప్పారు క్రిష్. తన గత సినిమాల కంటే ఈ మూవీలో కాస్త యాంగిల్ మార్చినట్లు చెప్పారు. సెప్టెంబర్ 5 కోసం అందరితో పాటే తాను కూడా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. 'ఏదైనా పవర్ ఫుల్ స్టోరీని స్త్రీ పాత్ర ద్వారా చెప్తే మనకొచ్చే లేయర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తూర్పు కనుమల్లో ఓ కొండ నీడ మరో కొండపై పడుతున్న క్రమంలో ఆ నీడలో శీలావతి అనే ఖరీదైన ఓ మత్తు పదార్థం పెరుగుతుంది. సినిమాలో అనుష్క పాత్ర పేరు కూడా శీలావతే. కొండల్లో గంజాయి అక్రమ రవాణా దురాగతాల గురించి చెప్పాలంటే అద్భుతంగా నేను అనుకున్న కథకు ఎమోషన్స్ పండించొచ్చు. అనుష్కకు ఉన్న గ్రేస్, స్టార్ డమ్ ఈ మూవీకి కరెక్ట్‌గా సరిపోతుంది. ఆమెతో కచ్చితంగా సినిమా చేయాలని అనుకున్నా.' అని చెప్పారు.


ఈ మూవీలో అనుష్కతో పాటు విక్రమ్ ప్రభు, చైతన్య రావు, రవీంద్ర విజయ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5న 'ఘాటి' ప్రేక్షకుల ముందుకు రానుంది.