Harish Shankar Open Up on Multi-Starrer With Pawan Kalyan and Ravi Teja: 'మిస్టర్ బచ్చన్' టీం ఇండియన్ ఐడల్ 3లో సందడి చేసింది. ఆగస్ట్ 15న మూవీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో కలిసి డైరెక్టర్ హరీశ్ శంకర్ 'ఇండియన్ ఐడల్ 3' సింగింగ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతేకాదు తన డ్రీం ప్రాజెక్ట్స్ గురించి మనసులో మాట బయటపెట్టారు.
అంతేకాదు తన కెరీర్ ఫెయిల్యూర్స్‌పై కూడా స్పందించారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్‌కి ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. ఒకేవేళ మల్టీస్టారర్ మూవీ చేయాల్సి వస్తే ఎవరితో తీస్తారు? అని అడగ్గా.. పవన్ కళ్యాణ్ రవితేజలతో సినిమా చేస్తానన్నారు. కాగా ఇద్దరికి హరీశ్ శంకర్ వీరాభిమాని. ఇద్దరితో ఆయనకు మంచి అనుబంధం ఉంది. కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్, రవితేజతో ఆయన సినిమా చేయడం పక్కా అనే అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) గురించి చెబుతూ.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అవుతుందని, అలాగే కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ అవుతుందన్నారు. ఈ సినిమా గబ్బర్ సింగ్‌ను మించి ఉంటుందంటూ మూవీ హైప్ క్రియేట్ చేశారు.
అలాగే ఎప్పటి నుంచో ఒక డ్రీం ఉందని, అది సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక్క సినిమా చేయాలనేది తన చీరకాల కోరిక అని మనసులో మాట బయటపెట్టారు. అనంతరం తన ఫెయిల్యూర్స్‌పై స్పందించారు. కొన్ని సందర్బాల్లో తాను దర్శకుడిగా ఫెయిల్ అయ్యానని, అంటూ రవితేజ మిరపకాయ సినిమాని ఉద్దేశిస్తూ చెప్పారు. కానీ తన సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదని హరీష్ శంకర్ పేర్కొన్నారు. ఇక పవన్ కళ్యాణ్-రవితేజ మల్టీస్టార్ తీస్తానంటూ హరీష్ శంకర్ ఇచ్చిన ఈ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందుకు సంబంధించిన ట్వీట్‌కు నేరుగా హరీష్ శంకర్ స్పందించడం విశేషం. చాలా మంది చాలాసార్లు అడిగారని, ఇది కార్యరూపం దాల్చాలని ఆశిద్దామంటూ ఆయన సమాధానం ఇచ్చారు.
కాగా ఇప్పటికే రవితేజ చిరంజీవితో కలిసి సినిమా చేసిన సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్యలో వీరిద్దరు అన్నదమ్ముళ్లుగా నటించారు. డైరెక్టర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇక వెండితెరపై ఒకేసారి చిరంజీవి, రవితేజలను చూడగానే థియేటర్లో విజిల్స్ మారుమోగాయి. థియేటర్లన్ని దద్దరిల్లాయి. మరి ఇద్దరు మాస్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఆ క్రేజీ కాంబో రియాక్షన్ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జస్ట్ అప్‌డేట్ ఈ రేంజ్‌లో మారుమోగితే ఇక ఇది నిజంగానే వర్క్ అవుట్ అయ్యి సెట్స్‌పైకి వస్తే ఇక పవర్ స్టార్, మాస్ మాహారాజా ఫ్యాన్స్‌కి పూనకాలే అని చెప్పాలి.
Also Read: దేవర 'చుట్టమల్లే' సాంగ్‌పై ట్రోల్స్ - స్పందించిన నిర్మాత నాగవంశీ, ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్!