Naga Vamshi Reacts on Devara Song Trolls: జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్‌ పాన్‌ ఇండియా మూవీ 'దేవర'. సెప్టెంబర్‌ 27న ఈ మూవీ రిలీజ్‌ కానున్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక్కొ అప్‌డేట్‌ ఇస్తుంది మూవీ టీం. ఇక నిన్న దేవర సెకండ్‌ సింగిల్‌ని రిలీజ్‌ చేసింది టీం. ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ల మధ్య తెరకెక్కిన ఈ మెలోడి సాంగ్ బాగా ఆకట్టుకుంటుంది.


చుట్టుమల్లే అంటూ సాగే హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగుందంటూ పాజిటివ్‌ రివ్యూస్‌ కూడా వస్తున్నాయి.అయితే మరోవైపు ఈ సాంగ్‌పై ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ పాట విడుదలైనప్పటి నుంచి నెట్టింట దీన్ని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ సాంగ్‌ ట్యూన్‌ని అనిరుధ్‌ కాపీ చేశాడని, ఇక ఇందులో కొన్ని సీన్స్‌ ప్రకటనలా ఉన్నాయంటూ మీమ్స్‌ పుట్టుకొచ్చాయి. సోషల్‌ మీడియాలో మొత్తం దేవర సెకండ్‌ సింగిల్‌ ట్రోల్సే దర్శనం ఇస్తున్నాయి. అయితే ఈ పాటపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించాడు.


ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ ఎవరు ఏం అనుకుంటే మనకంటే సాంగ్‌ మాత్రం సూపర్‌ ఏమంటారు బాయ్స్‌ అంటూ ట్వీట్‌ చేశాడు. "గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ఆఫీషియల్‌ ఈ సాంగ్‌ జోష్‌ ఎలా ఉంది బాయ్స్‌? ఇందులో తారక్‌ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కద బాయ్స్‌.." అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. నిజానికి ఈ పాట రిలీజ్‌ అవ్వగానే మ్యూజిక్‌ లవర్స్‌ అంతా ఎంజాయ్‌ చేశారు.






జాన్వీ, ఎన్టీఆర్‌ల కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు. వీరిద్దరి మధ్య సాగిన రొమాంటిక్‌ సాంగ్ కావడంతో విడుదలైన క్షణాల్లో ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యింది. గంటల్లోనే మిలియన్ల వ్యూస్‌ తెచ్చుకుంది. కానీ కొందరు ఈ పాట ట్యూన్ విని మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ పాట ఇప్పిటికే ఎక్కడో విన్నట్టుందంటూ గతంలో బాగా పాపులర్‌ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్‌ చేస్తున్నారు. అంతేకాదు దీనిపై మీమ్స్‌ క్రియేట్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. ఈ రెండు పాటల ట్యాన్‌ సేమ ఉందని, అనిరుధ్‌ అచ్చం దింపేశాడంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.



కాగా దేవర మూవీ సెప్టంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎన్టీఆర్ అన్నయ్య, హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై ఈ సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె దేవరను నిర్మిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్‌ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.


Also Read: ఆ మలయాళ బ్లాక్‌స్టర్‌ మూవీ రీమేక్‌ చేయనున్న బాలయ్య? - డైరెక్టర్‌ ఎవరంటే..!