Director Anil Ravipudi About Mega 157 Title Glimpse: మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు ఫుల్ బర్త్ డే ట్రీట్ ఇచ్చేలా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. పవర్ ఫుల్ వింటేజ్ లుక్‌లో ఫుల్ సెక్యూరిటీ మధ్య బాస్ ఎంట్రీ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా... మెగాస్టార్‌ను ఇలానే చూడాలని అనుకున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

వింటేజ్ లుక్... డబుల్ హైప్

ఇక 'మన శంకరవరప్రసాద్ గారు' టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీలో 5 శాతం వీఎఫ్ఎక్స్ కూడా వాడలేదని... ఈ లుక్ కోసం చిరంజీవి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. 'నేను చిన్నప్పటి నుంచీ చిరంజీవి గారి మూవీస్ చూస్తూ పెరిగా. ఆయన నటించిన రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు మూవీస్ అంటే చాలా ఇష్టం. ఈ గ్లింప్స్‌తో సినిమా ఎలా ఉండనుందో చిన్న హింట్ మాత్రమే ఇచ్చాను.

ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆయన్ను ఎలా చూడాలని అనుకుంటున్నారో దానికి రెండింతలు మన శంకరవరప్రసాద్ గారు'లో చూస్తారు. ఆయన అసలు పేరు కాస్త మార్చి మూవీ టైటిల్ ఫిక్స్ చేశాం. సాంగ్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ అద్భుతంగా వచ్చాయి.' అంటూ చెప్పారు అనిల్.

Also Read: 'పరదా' రివ్యూ: అనుపమ సినిమా హిట్టా? ఫట్టా? 'శుభం' దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?

సంక్రాంతికి బిగ్ సర్ ప్రైజ్

టైటిల్ గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు విక్టరీ వెంకటేష్‌కు డైరెక్టర్ అనిల్ థాంక్స్ చెప్పారు. త్వరలోనే మూవీలో ఆయన ఎంట్రీ ఉంటుందని చెప్పారు. 'ప్రస్తుతానికి టైటిల్ గ్లింప్స్‌లో వెంకటేష్ వాయిస్ మాత్రమే విన్నారు. త్వరలోనే సినిమాలో ఆయన ఎంట్రీ ఇవ్వనున్నారు. చిరు వెంకీ కాంబో ఎలా ఉండబోతోందో ఈసారి సంక్రాంతికి సర్‌ప్రైజ్‌తో చూస్తారు. ఆ సర్‌ప్రైజ్‌లు అన్నీ కూడా ఒక్కొక్కటిగా రివీల్ చేస్తాం.' అంటూ అనిల్ వెల్లడించారు.

అంచనాలకు మించి...

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ కచ్చితంగా అందరి అంచనాలను అందుకుంటుందని... మరోవైపు అంచనాలను మించి ఉంటుందంటూ కామెంట్ చేశారు అనిల్. 'నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి గారికి థాంక్స్. ఆయన ఆట, పాట, మ్యానరిజమ్స్, లుక్స్, ఫైట్స్ అనుకరించని వారు ఎవరూ ఉండరు. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఆయన్ను చాలామంది ఫ్యాన్స్ అనుకరిస్తూనే ఉంటారు. ఈ మూవీలో ఆయన కనిపించిన లుక్ పూర్తి ఒరిజినల్. 5 శాతం వీఎఫ్ఎక్స్ కూడా వాడలేదు. చిరంజీవి అభిమానిగా ఆయన్ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం నా అదృష్టం. బాస్ పండుగకు వస్తున్నాడు.' అంటూ చెప్పారు.

ఈ మూవీలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా... కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.