'శతమానం భవతి', 'శ్రీనివాస కళ్యాణం', ‘ఎంత మంచివాడవురా' వంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తెరకెక్కించిన సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'కథాకేళి'. చింత గోపాలకృష్ణ రెడ్డి సమర్పన్లో శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా టీజర్ లంచ్ ఈవెంట్ ని హైదరాబాదులో నిర్వహించారు చిత్ర యూనిట్. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కి అగ్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సినిమా లోగోని నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా.. టీజర్ ను డైరెక్టర్ హరిశ్ శంకర్ రిలీజ్ చేశారు.


ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘హరిష్ శంకర్, వివి వినాయక్, సతీష్ వేగేశ్న చాలామంది మా గుడిలో ఉన్నప్పుడు 'శతమానం భవతి' కథ గురించి మాట్లాడుతూ.. టైటిల్ గురించి అడిగినప్పుడు వినాయక్, హరీష్ టైటిల్ చాలా బాగుంటుందని చెప్పారు. ‘శతమానం భవతి’ సినిమా బ్యానర్లో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు అదే టైటిల్ తో సతీష్ బ్యానర్ పెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. సతీష్ తో పాటు మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. కొత్త వాళ్లు, పాత నటినటులతో, సాంకేతిక నిపుణుల కలయికలో సతీష్ చేసిన ఈ ప్రయత్నం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. 'కథాకేళి' టీజర్ చూస్తుంటే సతీష్ ఓ కొత్త ప్రయత్నం చేశాడని అనిపిస్తుంది. ఈ సినిమా విజయం సాధించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు" తెలిపారు దిల్ రాజు.



దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.? "శతమానం భవతి అనే టైటిల్ మా అందరికీ ఎంతో ఇంపార్టెంట్. నేను డీజే షూటింగ్ చేస్తున్న టైంలో దిల్ రాజు చిన్నపిల్లాడిలా పరిగెత్తుకుంటూ వచ్చి మనం నేషనల్ అవార్డ్ కొట్టాం అని చెప్పారు. ఎంతో సంతోషించాం. చాలా సంవత్సరాల తర్వాత 'శతమానం భవతి' సినిమా తెలుగు సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లి మనందరినీ గర్వపడేలా చేసింది. సతీష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను డైరెక్టర్ కాకముందు నుంచే ఆయన సక్సెస్ఫుల్ రైటర్. అప్పటినుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. గబ్బర్ సింగ్ నుండి డిజె, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాలకు పని చేసిన సతీష్ ఇవాళ శతమానంభవతి అనే బ్యానర్ పెట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ కి నా కోఆర్డినేషన్, సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇక దర్శకుడు సతీష్ ని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత దిల్ రాజు గారికి సందర్భంగా థాంక్స్ చెబుతున్నాను. అంతేకాకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా యునానిమస్ గా గెలిచిన దిల్ రాజు గారికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా అభినందనలు. 'కథాకేళి' టీజర్ చూస్తుంటే సినిమా మంచి పేరుతో పాటు లాభాలను తెచ్చిపెడుతుందని భావిస్తున్నా’’ అంటూ హరీశ్ శంకర్ చెప్పుకొచ్చారు.


చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అవుతుంది. ప్రియా ఓ ప్రియా అనే సినిమాతో మొదటిసారి నా పేరును స్క్రీన్ పై చూసుకున్నాను. ఆ రోజు నుంచి ఈరోజు వరకు రైటర్ గా డైరెక్టర్ గా నిలబడ్డాను. నేను ఈ బ్యానర్ పెట్టినప్పుడు ఎందుకు పెట్టావ్ అని చాలామంది అడిగారు. ఇదే ప్రశ్నను నేను ఇవి సత్యనారాయణ గారిని అడిగాను. హాయ్ సినిమా నుంచి ఆయన చివరి సినిమా వరకు నేను ఆయన దగ్గర పని చేశాను. అప్పుడు ఆయన అనుభవాలను చెప్పేవారు. ఓసారి ఈవీవీ అనే బ్యానర్ ఎందుకు పెట్టారు అని అడిగితే.. మనకు సినిమా తప్ప మరి ఏమి రాదు. మనం సినిమాలు మాత్రమే తీయగలం. మనం ప్లాపుల్లో ఉన్నప్పుడు మనతో నిర్మాతలు సినిమాలు చేయరు. ఒకవేళ నిర్మాతలు ఓకే అన్నా.. ఆర్టిస్టులు ముందుకు రారు. కష్టమైనా, నష్టమైనా మనమే చేయాలని అన్నారు. కోవిడ్ వల్ల నేను స్టార్ట్ చేసిన కోతిబ్కొమ్మచ్చి, శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ఈ గ్యాప్ లో ఓ కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని చేసిన సినిమానే 'కథాకేళి'. దిల్ రాజు గారు చెప్పినట్టు సినిమాలో డిఫరెంట్ గా ప్రయత్నం చేసినా ఆ స్టైల్ లో ఫ్యామిలీస్ అందరూ చూసి వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే కథ ఈ సినిమాలో ఉంది. సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ అందరికీ, మా చింతా గోపాలకృష్ణ గారికి థాంక్స్. ఖచ్చితంగా ఈ సినిమా అందరిని అలరిస్తుందని" అన్నారు.


Also Read : చిన్మయి కవల పిల్లలతో సమంత ఆట పాటలు - వీడియో వైరల్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial