భారతీయ బాక్స్ ఆఫీస్ పై 'ధురంధర్ 2' సవారీ కొనసాగుతోంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. మొదటి భాగం కంటే ఈ సినిమా ఎక్కువ జోరు చూపిస్తోంది. పెయిడ్ ప్రీవ్యూలు మొదలైన రోజు నుంచే టికెట్ కౌంటర్ల దగ్గర సందడి చేయడం ప్రారంభించింది. ఫస్ట్‌ వీకెండ్ రికార్డులు సృష్టించిన తరువాత... ఇప్పుడు వీక్ డేస్ లో కూడా రికార్డులు తిరగ రాస్తోంది. మొదటి సోమవారం చారిత్రాత్మక వసూళ్లు సాధించిన తరువాత... మొదటి మంగళవారం కూడా సంచలనం సృష్టించింది. విడుదలైన ఆరో రోజు... అంటే మంగళవారం 'ధురంధర్ ది రివెంజ్' ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం?

ఆరో రోజు 'ధురంధర్ 2' ఎంత కలెక్షన్లు రాబట్టిందంటే? ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2' బాక్స్ ఆఫీస్ పై ప్రతిరోజూ కొత్త రికార్డును లిఖిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రతిరోజూ భారీ వసూళ్లు సాధిస్తోంది. పెయిడ్ ప్రీవ్యూలో 43 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని, దానిని చేరుకోవడం రాబోయే సినిమాలకు సులభం కాదని అర్థమైంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ చిత్రం వీక్ డేస్ లో కూడా అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది.

Also ReadGaddar Awards 2026: గద్దర్ అవార్డుల్లో గోల్‌మాల్... రెండు కోట్లు నొక్కేశారా? బీఆర్ఎస్ నేత సంచలన ట్వీట్

సినిమా వసూళ్ల గురించి చెప్పాలంటే... పెయిడ్ ప్రీవ్యూల తర్వాత 102.55 కోట్ల రూపాయల ఓపెనింగ్ డేతో మొదలైంది. రెండో రోజు వసూళ్లలో కాస్త తగ్గుదల ఉంది. బాక్స్‌ ఆఫీస్ దగ్గర 80.72 కోట్లు సంపాదించింది. మూడో రోజు రూ. 113 కోట్లు వసూలు చేయగా, నాలుగో రోజు రూ. 114.85 కోట్లు వసూలు చేసింది. ఇక ఐదో రోజు మొదటి సోమవారం సెలవు లేనప్పటికీ... ఈ చిత్రం 65 కోట్ల భారీ వసూళ్లు సాధించింది.

  • ఇప్పుడు సాక్‌నిల్క్ లెక్కల ప్రకారం... 'ధురంధర్ 2' విడుదలైన ఆరో రోజు అంటే మొదటి మంగళవారం 56.55 కోట్లు వసూలు చేసింది.
  • దీంతో ఇండియాలో 'ధురంధర్ 2' ఆరు రోజుల నెట్ వసూళ్లు ఇప్పుడు 575.67 కోట్లకు చేరుకున్నాయి.

గదర్ 2’, ‘పఠాన్యానిమల్లను బీట్ చేసిన ‘ధురంధర్ 2’బాహుబలి 2 హిందీ వెర్షన్ (511 కోట్లు) వసూళ్లను ఇప్పటికే ‘ధురంధర్ 2’ అధిగమించింది. అలాగే... 2017 నుండి 2023 వరకు అన్ని హిందీ సినిమాలకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. దీనితో పాటు 500 కోట్లు వసూలు చేసిన అత్యంత వేగవంతమైన హిందీ చిత్రంగా కూడా నిలిచింది. ఈ స్పై థ్రిల్లర్ 575.67 కోట్ల వసూళ్లతో సన్నీ డియోల్ నటించిన గదర్ 2 (525 కోట్లు), షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ (543 కోట్లు), రణబీర్ కపూర్ నటించిన యానిమల్ (556 కోట్లు) వసూళ్లను అధిగమించింది. బుధవారం నాటికి ఈ చిత్రం 600 కోట్ల మార్కును సులభంగా దాటుతుందని భావిస్తున్నారు.

Also ReadKalabhairava - Kavya Kalyanram Wedding: పెళ్లికి ముందు జంటగా... కాలభైరవ - కావ్య కావాలని హింట్ ఇచ్చారా?