ఛియాన్ విక్రమ్... 'అపరిచితుడు'తో తెలుగులోనూ భారీ విజయం అందుకున్న కథానాయకుడు. ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు ఆయన చాలా సుపరిచితుడు. ఇప్పుడు ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
అజయ్ భూపతి దర్శకత్వంలో...
Ajay Bhupathi to direct Dhruv Vikram: అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ ఓ భారీ సినిమా చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. విక్రమ్, ఆయన తనయుడిని కలిసి అజయ్ భూపతి కొన్ని రోజుల క్రితం కలిశారని, న్యూ ఏజ్ కాన్సెప్ట్ కథను చెప్పారని సమాచారం. ఆయన కథ నచ్చడంతో పాటు ట్రాక్ రికార్డ్ చూసి వెంటనే ఓకే చెప్పేశారట.
Also Read: పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
'ఆర్ఎక్స్ 100'తో అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యారు. తొలి సినిమా ఆయనకు విజయం ఇవ్వడమే కాదు... తెలుగులో కొత్త వరవడికి శ్రీకారం చుట్టింది. కొత్త తరహా సినిమాలకు నాంది పలికింది. ఆ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి హీరో హీరోయిన్లుగా 'మహా సముద్రం' తీశారు. మూడో సినిమాగా తీసిన 'మంగళవారం' అజయ్ భూపతికి మరో విజయం ఇవ్వడంతో పాటు గౌరవం తెచ్చింది.
'మంగళవారం' సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఆస్కార్స్ 2025 అవార్డులకు ఇండియా నుంచి 'లాపతా లేడీస్' అఫీషియల్ ఎంట్రీగా పంపించారు. అయితే... ఆ సినిమాకు గట్టి పోటీ ఇచ్చిన సినిమాల్లో 'మంగళవారం' ఉంది. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ధృవ్ విక్రమ్ హీరోగా అజయ్ భూపతి భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నారు.
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధృవ్ విక్రమ్!
Dhruv Vikram Upcoming Movies: 'అర్జున్ రెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ'తో ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తండ్రితో కలిసి 'మహాన్' సినిమా చేశారు. ఇప్పుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఆయన 'బిషన్' సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు 'కబాలి', 'కాలా', 'తంగలాన్' ఫేమ్ పా రంజిత్ ఆ చిత్రానికి సమర్పకులు. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా ఉండొచ్చు.