Singer Sagar Became Father: టాలీవుడ్ రాక్‌స్టార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఇంట పండగ వాతావరణం నెలకొంది. ఆయన తమ్ముడు, సింగర్ సాగర్ తండ్రయ్యాడు. అతడి భార్య మౌనికి రెండు రోజులు క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కొద్ది నెలల క్రితం గర్బం దాల్చిన మౌనిక ఫిబ్రవరి 21న బిడ్డకు జన్మినిచ్చింది. దీంతో సాగర్ దంపతులకు ఇండస్ట్రీ ప్రముఖులు, సిన్నిహితులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడిగా సాగర్ ఇండస్ట్రీకి సుపరిచితమే. అయితే అతడు సింగర్ అనే విషయం చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. అన్న సంగీత దర్శకత్వంలోనే ఎన్నో పాటలు పాడి గాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.
అంతేకాదు గతంలో ఓ సింగింగ్ షోకు కూడా యాంకర్‌గా వ్యవహరించాడు సాగర్. ఈ క్రమంలో 2019లో డాక్టర్ మౌనికను పెళ్లాడాడు. అయితే గతంలో సాగర్-మౌనిక దంపతులకు ఇది రెండో సంతానం. మొదట వారికి కుమారుడు జన్మించాడు. అతడి పేరు వివాన్ దక్ష్. గతేడాది సెప్టెంబర్ 18న వివాన్ ఫస్ట్ బర్త్‌డే జరిగింది. ఈ సందర్బంగా సాగర్ తనయుడికి బర్త్‌డే విషెష్ చెబుతూ దేవిశ్రీ ప్రసాద్ ట్విట్ చేశాడు. బడ్డి డాడీ బాయ్ అంటూ వివాన్‌ను ముందుగా పిలుచుకున్న దేవిశ్రీ అతడితో సరదగా గడిపన ఫొటోలను షేర్ చేశాడు. ఇక తాజాగా తమ్ముడు సాగర్ మరోసారి తండ్రి అవ్వడవంతో రాక్‌స్టార్ ఇంట్లో సంబరాలు చేసుకుంటున్నారు. కాగా దేవిశ్రీ ప్రసాద్ నాలుగు పదుల వయసులోనూ మోస్ట్ బ్యాచీలర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందాడు.
దేవిశ్రీ ఎప్పుడు ఓ ఇంటివాడు అవుతాడాని ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఆయనకు 44 ఏళ్లు. తాజాగా ఆయన తమ్ముడు తండ్రి కావడంతో దేవిశ్రీ పెళ్లి ఎప్పుడని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. గతంలో దేవిశ్రీ పెళ్లి గురించి అనేక వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలోని అమ్మాయితోనే ప్రేమలో ఉన్నట్లు, కాదు ఫ్యామిలీ సర్కిల్ లోని మరదలునే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇవన్నీ ప్రచారం వరకే మిగిలిపోయాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన ఆయన ఎప్పుడూ పెళ్లి, డేటింగ్ రూమర్స్‌లో వార్తల్లో నిలుస్తున్నాడు. మరి ఈ ఏడాదైన దేవి ఓ ఇంటివాడు అవుతాడో? లేదో చూడాలి! ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ చేతిలో పలు ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో పుష్ప 2, తండేల, ఉస్తాద్ భగత్ సింగ్, కంగువ, రత్నం సినిమాలతో పాటు ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.