మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ 'దేవర' (Devara Part 1). ఇప్పటికే ఇండియాలో రిలీజై, దుమ్మురేపిన ఈ మూవీ జపాన్ లో సందడి చేయడానికి ముస్తాబు అవుతోంది. తాజాగా అక్కడ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అనే సమాచారం వచ్చేసింది. వచ్చే ఏడాది మార్చ్ లో జపాన్ లో 'దేవర' మాస్ ఫెస్ట్ మొదలు కాబోతోంది.
జపాన్ లో 'దేవర'... రిలీజ్ డేట్ ఫిక్స్
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'దేవర'. ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ మూవీగా తెరపైకి వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. తండ్రి దేవర, కొడుకు వరదగా రెండు పాత్రల్లో కనిపించి తారక్ తెరపై మ్యాజిక్ చేశారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. కేవలం రిలీజ్ అయిన మూడు వారాల్లోనే 300 కోట్ల కలెక్షన్లు రాబట్టి అదరగొట్టాడు 'దేవర'. ఇక ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ప్రకారం పాన్ ఇండియా సినిమాలు జపాన్ లో సైతం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. 'పుష్ప , 'కల్కి 2898 ఏడీ' బాటలోనే 'దేవర' మూవీని కూడా ఇప్పుడు జపాన్లో రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, 'కల్కి 2898 ఏడీ' మూవీని రిలీజ్ చేసిన ట్విన్ డిస్ట్రిబ్యూటర్స్ 'దేవర' మూవీని జపాన్లో విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. 2025 మార్చ్ 28న 'దేవర' మూవీని జపాన్లో రిలీజ్ చేయబోతున్నారు. సమాచారం ప్రకారం 'దేవర' పార్ట్ 1 టికెట్లు జపాన్లో 2025 జనవరి 3 నుంచే అందుబాటులోకి రాబోతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా నటించిన 'ఆర్ఆర్ఆర్' మూవీకి జపాన్ లో మంచి ఆదరణ దక్కింది. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు అక్కడి జనాలు. దీంతో తారక్ కు ఇప్పుడు జపాన్ లో కూడా భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత జపాన్ లో రిలీజ్ కాబోతున్న ఎన్టీఆర్ మూవీ 'దేవర'. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే జాన్వికి తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. అలాగే విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీతోనే టాలీవుడ్లోకి అరంగ్రేటం చేశారు. వీరిద్దరితో పాటు ప్రకాష్ రాజ్, శృతి మరాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
Also Read: 'మ్యాక్స్' రివ్యూ: మ్యాగ్జిమమ్ మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన కిచ్చా సుదీప్ - మరి సినిమా హిట్టా? ఫట్టా?
'వార్ 2'తో వచ్చే ఏడాది
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'వార్ 2' షూటింగ్లో బిజీగా ఉన్నారు. హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్ పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా, 2025 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది.
Read Also : Madhavi Latha Comments: దిల్ రాజుని అడ్డం పెట్టుకుని.. ఈ గలీజు పనులేంటి రేవంత్ రెడ్డి సార్?