'దేవర'కు క్రిటిక్స్ నుంచి సూపర్ పాజిటివ్ రివ్యూస్ ఏమీ రాలేదు.‌ ఆ రివ్యూలు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) అభిమానులకు కాస్త నిరాశకు గురి చేశాయి. మొదటి రోజు బెనిఫిట్ షోస్ భారీ ఎత్తున వేయడం కూడా కొంత నెగిటివ్ టాక్ రావడానికి కారణం అయ్యిందని చెప్పాలి. ప్రేక్షకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కాలేదు. అటు ఇటు కొంత వ్యతిరేకత ఉండడంతో వసూలు ఎలా ఉంటాయో అని అభిమానులు కొందరు ఆందోళన చెందారు. అయితే... బాక్సాఫీస్ బరిలో ఎన్టీఆర్ తన సత్తా చాటుతున్నారు. భారీ కలెక్షన్స్ దిశగా సినిమాను తీసుకువెళ్తున్నారు. 


రెండు రోజుల్లో 200 కోట్లు దాటిన 'దేవర'!
Devara Two Days Collection Worldwide: దేవర సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే... కలెక్షన్స్ అప్డేట్ చేసే బాక్స్ ఆఫీస్ పోర్టల్స్ కొన్ని 140 కోట్ల రూపాయల మాత్రమే వచ్చాయని తెలిపాయి. ఆ రెండు నంబర్స్ లో ఏది నిజం అనేది పక్కన పెడితే... ఎన్టీఆర్ సత్తా ఏమిటి అనేది మరోసారి ప్రేక్షకులకు తెలిసింది. మిక్స్డ్ టాక్, ఇంకా చెప్పాలంటే గొప్పగా లేని రివ్యూలతో ఆయన మొదటి రోజే 150 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించారు. రెండో రోజు కూడా 'దేవర' సినిమాకు రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి అంటే కారణం ఎన్టీఆరే. రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 243 కోట్లు కలెక్ట్ చేసిందని యూనిట్ అధికారికంగా ప్రకటించింది.


Also Read: రెండో రోజూ తెలుగులో అదరగొట్టిన ఎన్టీఆర్ - తెలంగాణ, ఏపీలో 'దేవర' 2 డేస్ టోటల్ షేర్ ఎంతంటే?





రెండు రోజుల్లో దేవర వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ గ్రాస్ కలెక్షన్ 200 కోట్ల రూపాయలు దాటిందని ట్రేడ్ వర్గాలు సైతం పేర్కొన్నాయి. మొదటి రోజు 140 కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చిందని పేర్కొన్న బాక్స్ ఆఫీస్ ట్రేడ్ పోర్టళ్లు... రెండో రోజు 80 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని తెలిపాయి. దాంతో రెండు రోజుల్లో ఈ సినిమాకు మొత్తం 220 కోట్ల రూపాయలకు గ్రాస్ వచ్చినట్లు అయింది.



రెండో రోజు హిందీలో పెరిగిన వసూళ్లు!
'దేవర' సినిమాకు మొదటి రోజు నార్త్ ఇండియాలో భారీ హైప్ కనిపించలేదని కొంత మంది పేర్కొన్నారు.‌ సినిమా ఓపెనింగ్ స్లోగా ఉంది. అయితే... సినిమాకు నెమ్మదిగా ప్రేక్షకులు రావడం మొదలు అయింది. మొదటి రోజు ఈ సినిమాకు హిందీ వెర్షన్ నుంచి ఏడు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ రాగా... రెండో రోజు 10 కోట్లకు పైగా వచ్చిందని తెలిసింది. ఫస్ట్ వీకెండ్ అయ్యే సరికి 'దేవర' హిందీ వెర్షన్ నెట్ కలెక్షన్ 30 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.


Also Readవెంకీ మామతో దేవిశ్రీ స్టెప్పులు - ఐఫా 2024లో గ్లామరస్ పెర్ఫార్మన్స్‌లు... ఫోటోలు చూడండి