పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బిగ్గెస్ట్ డ్యాన్స్ బస్టర్ అంటూ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో విడుదల చేశారు కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్. సాంగ్ ప్రోమోలో పవర్ స్టార్ వేసిన స్టెప్పులు అభిమానులను అలరించారు. ఇప్పుడు ఆ సాంగ్ ఫుల్ లిరికల్ వీడియో వచ్చింది.
దేఖ్ లేంగే సాలా... 'ఉస్తాద్'లో మొదటి పాటలిరికల్ వీడియోలో పవన్ స్టెప్పులు చూశారా?పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇంతకు ముందు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. వాళ్ళిద్దరి కలయికలో పాటలు మ్యూజికల్ హిట్టు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురి కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తోంది. ఇవాళ విడుదల చేసిన లిరికల్ వీడియోలో పవన్ కళ్యాణ్ ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు వేశారు.
'దేఖ్ లేంగే సాలా' లిరికల్ వీడియో చూస్తే... పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ వేసినట్టు అర్థం అవుతోంది. ఆ డ్యాన్సులో గ్రేస్ కనిపిస్తోంది. ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా సాంగ్ సాగింది. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ బావుంది. దానికి భాస్కరభట్ల రవికుమార్ ఫుట్ ట్యాపింగ్ లిరిక్స్ రాశారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు విశాల్ డడ్లానీ అంతే ఎనర్జీతో పాడారు. ఒక్కసారి ఆ లిరికల్ వీడియో చూడండి.
పవన్ కళ్యాణ్ సినిమాలో ఇద్దరమ్మాయిలు'ఉస్తాద్...'లో అందాల రాశీ ఖన్నా & శ్రీ లీల'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఇద్దరు అందాల భామలు నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన కథానాయికలు రాశీ ఖన్నా, శ్రీ లీల నటించారు. ఇద్దరికీ హీరోతో మొదటి చిత్రమిది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు పార్తీబన్ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుందీ సినిమా.
Also Read: Akhanda 2 Movie Review - 'అఖండ 2' రివ్యూ: బాలకృష్ణ రుద్రతాండవం - బోయపాటి శ్రీను ఎలా తీశారంటే?