దీపికా పదుకోన్ (Deepika Padukone) ఎయిట్ అవర్స్ షిఫ్ట్ కండిషన్ మీద పెద్ద ఎత్తున డిస్కషన్ నడిచింది. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న 'స్పిరిట్' టీం అప్రోచ్ అయినప్పుడు ఆమె పెట్టిన కండిషన్లలో అదొకటని ప్రచారం జరిగింది. దీపికాకు మద్దతు ఇచ్చిన వాళ్ళు, అది సరికాదని విమర్శించిన వాళ్ళూ ఉన్నారు. సినిమాల్లో స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత హీరోయిన్లు చెప్పింది చెల్లుతుందేమో... కానీ సీరియల్ స్టార్స్ ఇంకా పది పన్నెండు గంటలకు పైగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సీరియళ్ళలో కూడా 8 అవర్స్ మాత్రమే షూటింగ్ చేసేలా షిఫ్ట్ పెట్టాలని చర్చ జరుగుతోంది. దానిపై హిందీ సీరియల్ నటి దీపికా సింగ్ చెప్పిన మాటలు దీపికా పదుకోన్‌కు కౌంటర్ అన్నట్టు ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

నేను 13-14 గంటలు పని చేస్తాను - నటి దీపికా సింగ్ఒక షిఫ్టులో 8 గంటలు మాత్రమే నటించాలని జరుగుతున్న వాదనపై ప్రముఖ హిందీ టీవీ సీరియల్ నటి దీపికా సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన వృత్తిని కేవలం పనిగా కాకుండా ఒక అభిరుచిగా భావిస్తానని, అందుకే ఎన్ని గంటలు నటించాలి? ఎన్ని గంటలు పని చేస్తున్నాను? అనే దాని గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని, చెందను అని తెలిపారు.

Also ReadJailer 2 - రజనీకాంత్ సినిమాలో చిరంజీవి భార్య... ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్

Continues below advertisement

ఒక ఇంటర్వ్యూలో దీపికా సింగ్ మాట్లాడుతూ... ''నేను నా పాత్రలో పూర్తిగా లీనం అయిపోతాను. నటిగా సన్నివేశాలు బాగా రావడానికి, నటనలో నాణ్యతను పెంచడానికి ఎక్కువ సమయం కేటాయించడం నాకు సాధారణమైన విషయం. నేను 12 గంటల షిఫ్ట్ చేసిన (నటించిన) తర్వాత కూడా ఇంకా సీన్లు మిగిలి ఉంటే... 13 లేదా 14 గంటలు కూడా పని చేస్తా. తక్కువ సమయం ఇస్తే మన సన్నివేశాలు సరిగా రావు. అలాగే దర్శకులకు సీన్లను మెరుగ్గా తీర్చిదిద్దడానికి తగినంత అవకాశం ఉండదు" అన్నారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రమే షిఫ్ట్ గురించి ఆలోచన వస్తుందని ఆమె అన్నారు. 

Also ReadJetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?

తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పుడు హిందీ టెలివిజన్ రంగంలో అడుగు పెట్టానని దీపికా సింగ్ తెలిపారు. ''నేను మే 5, 2011న ముంబైకి వచ్చా. తొలినాళ్లలో రైలులో ప్రయాణించా. కానీ ముంబై తనకు పేరు, ప్రఖ్యాతులతో పాటు విమానాల్లో ప్రయాణించే స్థాయి ఇచ్చింది. అప్పుడే అలసిపోతే భవిష్యత్తులో ఏం సాధించగలను? ఇంకా చేయాల్సినది, చూపించాల్సినది చాలా ఉంది" అని దీపికా సింగ్ తెలిపారు. హిందీ సీరియల్ 'దియా ఔర్ బాతి హమ్'లో సంధ్య రాఠీ పాత్రతో దీపికా సింగ్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం 'మంగళ లక్ష్మి'లో నటిస్తున్నారు.

Also ReadPatriot Movie Review - మమ్ముట్టి 'పేట్రియాట్' రివ్యూ: ప్రత్యేక పాత్రలో మోహన్ లాల్ - మలయాళ మల్టీస్టారర్ ఎలా ఉందంటే?