Deepika Padukone Reaction On Sandeep Vanga Comments: గత రెండు రోజులుగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన సినిమా లీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కామెంట్స్ చేయగా.. ఆమెను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు ట్రోల్ చేశారు. ఈ కామెంట్స్‌పై తాజాగా దీపిక స్పందించారు.
'నిజాయతీకే ఇంపార్టెన్స్ ఇస్తా'
తన మనసు ఏం చెబుతుందో ఎప్పుడూ అదే వింటానని అన్నారు దీపిక. ఓ ఫ్యాషన్ షోలో సందడి చేసిన ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'జీవితంలో బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే నిజాయతీ చాలా ముఖ్యం. నేను కూడా దానికే ప్రాధాన్యతనిస్తాను. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడల్లా నా మనసు చెప్పేదే వింటాను. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకుని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాను.' అని అన్నారు.
ఇండైరెక్ట్‌గా కౌంటర్ ఇచ్చారా?
అయితే, దీపికా కామెంట్స్‌పై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇండైరెక్ట్‌గా ఆమె సందీప్ రెడ్డి వంగాకు కౌంటర్ ఇచ్చారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. పిల్లి చేష్టలు అంటూ డైరెక్టర్ చేసిన కామెంట్స్‌కు సమాధానం ఇచ్చారని చెబుతున్నారు. ఇక దీపికా చివరిసారిగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో 'సింగం అగైన్' సినిమాలో కనిపించారు. దీంతో పాటే 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌లో ఆమె సుమతిగా కనిపించారు.
Also Read: నువ్వెవరో నీకే తెలియని యోధావి - అప్పుడు 'హనుమాన్'.. ఇప్పుడు రాముడు.. 'మిరాయ్' టీజర్ వేరే లెవల్..
అసలేం జరిగిందంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అవెయిటెడ్ మూవీ 'స్పిరిట్'లో హీరోయిన్‌గా దీపికా పదుకోన్ నటించాల్సి ఉంది. అయితే.. ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్, కండీషన్లు నచ్చక డైరెక్టర్ సందీప్ వంగా 'యానిమల్' హీరోయిన్ త్రిప్తి దిమ్రిని ఈ సినిమాలో హీరోయిన్‌గా సెలక్ట్ చేశారు. అంతేకాకుండా మూవీలో హీరోయిన్ ఒక్కరే అని.. అదీ తృప్తి అని క్లారిటీ ఇచ్చారు సందీప్. దీపికను పక్కనపెట్టి త్రిప్తిని ఎంపిక చేసినప్పటి నుంచీ సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది.
అటు సోషల్ మీడియా.. ఇటు బాలీవుడ్ మీడియాలో 'స్పిరిట్' మూవీపై ట్రోలింగ్ సాగింది. ఇదొక అడల్ట్ రేటెస్ట్ మూవీ అని అందుకే దీపిక నటించడం లేదంటూ కామెంట్స్ చేశారు. దీనిపై డైరెక్టర్ సందీప్ వంగా ట్వీట్ చేశారు. దీపికా పదుకోన్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినప్పటికీ.. కథ మొత్తం లీక్ చేసినా తనకు ఏం పర్వాలేదంటూ రాసుకొచ్చారు. తాను యాక్టర్‌పై 100 శాతం నమ్మకంతోనే కథ చెబుతానని.. అది రాయని అగ్రిమెంట్ అని అన్నారు. 'నా స్టోరీని బయటపెట్టడం ద్వారా ఎలాంటి మనిషివో చెప్పావు. నీ ఫెమినిజం అంటే ఇదేనా?, దర్శకుడిగా ప్రతి స్టోరీ వెనుక కొన్నేళ్ల కష్టం ఉంటుంది. ఈసారి స్టోరీ మొత్తం చెప్పేసినా.. నాకు కొంచెం కూడా ఫరఖ్ పడదు. డర్టీ పీఆర్ గేమ్.' అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు. అయితే, ఇది దీపికను ఉద్దేశించే అని నెటిజన్స్ కామెంట్స్ చేశారు. తాజాగా దీనిపై దీపికానే ఇండైరెక్ట్‌గా కామెంట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.