Ramya Krishnan Bold Photos Viral: ఈరోజుల్లో AI టెక్నాలజీ వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తరచుగా చూస్తునే ఉన్నాం. ముఖ్యంగా AIను తప్పుగా ఉపయోగించే నేరస్తులకు ముందుగా సినీ సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. అందులోనూ హీరోయిన్సే వీరి టార్గెట్. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ మొహాలను AIతో మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తాజాగా రమ్యకృష్ణకు సంబంధించిన బోల్డ్ ఫోటోలు వైరల్ అవ్వడం చూస్తుంటే ఇది కూడా AI పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రమ్యకృష్ణ బోల్డ్ ఫోటోలు తెగ షేర్ అవుతున్నాయి.


ఫోటోలపై మీమ్స్..


డీప్ నెక్ బ్లౌజ్, కట్ లెహెంగా వేసుకున్న రమ్యకృష్ణ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇది మీమ్ క్రియేటర్స్ కంటపడడంతో ‘బాహుబలి’ మూవీలోని సీన్‌ను ఉపయోగిస్తూ దీనిపై మీమ్స్ తయారు చేస్తున్నారు. రమ్యకృష్ణ బోల్డ్ లుక్ చూసి కట్టప్ప షాక్ అయ్యి రాజమాతా అని పిలుస్తున్నట్టుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఈ మీమ్స్ చూడడానికి ఫన్నీ అనిపించినా ఆ ఫోటోలు మాత్రం రమ్యకృష్ణవి కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. AI ద్వారా బాధితులు అయిన నటీమణుల లిస్ట్‌లో ఇప్పుడు రమ్యకృష్ణ కూడా యాడ్ అయ్యిందని ఫిక్స్ అయిపోతున్నారు.




రమ్యకృష్ణ అలా చేయరు..


సీనియర్ హీరోయిన్ అయిన రమ్యకృష్ణ ఎక్కువశాతం తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయరు. తన పర్సనల్ లైఫ్‌లో జరిగే స్పెషల్ మూమెంట్స్ గురించి మాత్రమే ఫాలోవర్స్‌తో పంచుకుంటారు. ఆఫ్ స్క్రీన్ గ్లామర్‌గా ఉండడానికి ఇష్టపడినా ఎక్స్‌పోజింగ్‌కు మాత్రం కాస్త దూరంగానే ఉంటారు. అలాంటి రమ్యకృష్ణ.. ఇలాంటి ఒక బోల్డ్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేసిందంటే తాము నమ్మమని ఫ్యాన్స్ అంటున్నారు. AI గురించి అవగాహన ఉన్నవారు, దాని ద్వారా మొహాలను మార్ఫ్ చేయవచ్చని తెలిసిన వారు రమ్యకృష్ణ ఫోటోలు చూడగానే ఇవి కచ్చితంగా ఎడిట్ చేసినవే అని చెప్పేయగలరు. కానీ AI గురించి తెలియనివారు మాత్రం తనే ఇలాంటి బోల్డ్ ఫోటోషూట్‌లో పాల్గొందేమో అనుకునే అవకాశాలు ఎక్కువ.


వారంతా బాధితులే..


ఇప్పటికే AIలోని డీప్ ఫేక్ అనే టెక్నాలజీ ద్వారా పలువురు బాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలు మోర్ఫ్ అయ్యి సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ముందుగా రష్మిక మందనా.. AI టెక్నాలజీకి బాధితురాలు అయ్యింది. అప్పట్లో ఈ టెక్నాలజీ గురించి చాలామందికి ఐడియా లేకపోవడంతో ఆ వీడియోలో ఉన్నది రష్మికనే అని నమ్మేశారు. ఆ తర్వాత ఏ వీడియోను ఉపయోగించి డీప్ ఫేక్ చేశారో.. దాని ఒరిజినల్ వీడియో బయటికొచ్చింది. ఆ తర్వాత ఆలియా భట్ డీప్ ఫేక్ వీడియో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటినుండి సినీ సెలబ్రిటీలు.. ఈ AI, డీప్ ఫేక్‌తో జాగ్రత్తగా ఉండాలని అందరినీ హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా ఇప్పుడు రమ్యకృష్ణ కూడా ఈ టెక్నాలజీకి బాధితురాలు అవ్వాల్సి వచ్చింది.



Also Read: పూర్తి కథ తెలియకుండా ఎవరినీ జడ్జ్ చేయకండి - వెంకీ మామకు ఏమైంది? అలాంటి పోస్ట్ పెట్టారు?