సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025లో తన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అదే రోజు తెలుగు సినిమా ఈవెంట్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తన తొలి తెలుగు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో డ్యాన్స్ చేసి స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు.


శ్రీవల్లి స్టెప్ వేసిన డేవిడ్ వార్నర్!
David Warner dancing on srivalli song at Robinhood pre release event: సన్ రైజర్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌గా సాధించిన విజయాలతో పాటు డెవిడ్‌ వార్నర్‌ను తెలుగు ప్రజలకు దగ్గర చేసింది, తెలుగు ప్రజల్లో ఆయన పాపులారిటీని పెంచింది 'పుష్ప 2' మేనరిజమ్స్. క్రికెట్ స్టేడియంలో 'తగ్గేదే లే' అంటూ ఆయన చేసిన హంగామాను ఎవరూ అంత త్వరగా మరువలేరు. ఇంతకు ముందు కొన్నిసార్లు 'పుష్ప 2' సినిమాలో 'చూపే బంగారమాయనే శ్రీవల్లి...' పాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసిన హుక్‌ స్టెప్‌ను తనదైన శైలిలో డేవిడ్ వార్నర్ వేశారు. ఇప్పుడు 'రాబిన్‌హుడ్‌' ప్రీ రిలీజ్ వేడుకలో మరోసారి వేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది.


Also Read: ఆ థంబ్‌ నైల్స్‌ ఏంటి? ఆర్మీకి ఇచ్చే గౌరవం ఇదేనా? మా ఆయన బతికే ఉన్నారు - నటి గాయత్రి భార్గవి






నితిన్... శ్రీ లీల... కేతికా శర్మతో...
'అదిదా సర్‌ప్రైజ్‌'కు డేవిడ్ డాన్స్!
'రాబిన్‌హుడ్‌' సినిమాలో యంగ్ హీరోయిన్ కేతికా శర్మ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. 'అదిదా సర్‌ప్రైజ్‌' సాంగ్, అందులో హుక్ స్టెప్ కూడా వైరల్ అయ్యాయి. హీరో హీరోయిన్లు నితిన్, శ్రీ లీల, ఆ సాంగ్ చేసిన కేతికా శర్మతో పాటు డేవిడ్ వార్నర్ స్టేజి మీద ఆ పాటకు స్టెప్స్ వేశారు. ఈవెంట్ అంతటికీ ఆయన హైలైట్ అయ్యారు.


Also Readఅట్లీ సినిమాతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్... ప్రజెంట్ ఇండియాలో టాప్ అతనేనా!?






వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన 'రాబిన్‌హుడ్‌' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రొడ్యూస్ చేశారు. నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, 'వెన్నెల' కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదల అవుతోంది.