Warner As DJ Tillu: వార్నర్ 'డీజే టిల్లు' గెటప్- వైరల్‌గా మారిన లుక్

Warner As DJ Tillu: డీజే టిల్లు సినిమాలోని టిల్లు క్యారెక్టర్ కు తన ముఖాన్ని జోడించి ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన రీల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Continues below advertisement

Warner As DJ Tillu: డేవిడ్ వార్నర్... క్రికెటర్ గా ఎంత ఫేమస్సో చెప్పనవసరం లేదు. ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడు. జట్టుకు ఒంటి చేత్తో విజయాలందించగల ప్లేయర్. తీరిక లేని షెడ్యూల్ తో క్రికెట్ ఆడే వార్నర్ లో మరో కళ కుడా ఉంది. అదే రీల్స్ చేయడం. సినిమాల్లోని ఫేమస్ క్యారెక్టర్లకు తన ముఖాన్ని జోడించి రీల్స్ చేయడంలో వార్నర్ స్టైలే వేరు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లోని ప్రఖ్యాత క్యారెక్టర్లకు ఫేస్ మార్ఫింగ్ చేసి బాగా ఫేమస్ అయ్యాడు. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహించిన ఈ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఈ రీల్స్ తోనూ  తెలుగు వారికి మరింత దగ్గరయ్యాడు. 

Continues below advertisement

తాజాగా డీజే టిల్లు సినిమాలోని టిల్లు క్యారెక్టర్ కు తన ముఖాన్ని జోడించి చేసిన రీల్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ సినిమాలోని ఓ సీన్ ను మార్ఫింగ్ చేసిన వార్నర్ దాన్ని ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు. కాసేపటికే అది వైరల్ గా మారింది. మరింకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి. 

ఇంతకు ముందు చాలా తెలుగు సినిమాల్లోని ప్రముఖ క్యారెక్టర్లకు వార్నర్ రీల్స్ చేశాడు. పుష్ప, ఆర్ ఆర్ ఆర్ తదితర సినిమాల రీల్స్ చాలా ఫేమస్ అయ్యాయి. 

 

Continues below advertisement