Sandeep Raj Wedding: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటల మీదకు వెళ్లడానికి రెడీ అవుతోంది. రంగుల ప్రపంచంలో మొదలైన ఆ జంట పరిచయం ఏడు అడుగులు వేసే వరకు వెళుతోంది. యువ దర్శకుడు సందీప్ రాజ్ త్వరలో వివాహ బంధంలో అడుగు పెట్టనున్నారు. ఇంతకీ, ఆయన పెళ్లి చేసుకోబోయేది ఎవరినో తెలుసా?
నటి చాందిని రావుతో సందీప్ రాజ్ పెళ్లి
Sandeep Raj and Chandini Rao Wedding: చాందిని రావు... తెలుగు ప్రేక్షకులు కొంత మందికి ఈ అమ్మాయి తెలిసే ఉంటుంది. సందీప్ రాజ్ కథ అందించిన 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్‌లో ఓ పాత్ర చేసింది. 'రణస్థలి'తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ కనిపించింది. ఆమెతో సందీప్ రాజ్ ఏడు అడుగులు వేయనున్నారు.
యూట్యూబ్ ఫిల్మ్స్ నుంచి సందీప్ రాజ్ ప్రయాణం మొదలైంది. అప్పట్లో చాందిని రావుతో ఆయనకు పరిచయం అయినట్టు తెలుస్తోంది. ఇక, సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అయిన 'కలర్ ఫోటో'లోనూ చాందిని రావు ఓ పాత్రలో కనిపించారు. దర్శకుడు - నటిగా ఉన్న వాళ్లిద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు.
విశాఖలో నిశ్చితార్థం... తిరుపతిలో పెళ్లి
Sandeep Raj Wedding Date: సందీప్ రాజ్, చాందిని రావుల నిశ్చితార్థం నవంబర్ 11న విశాఖ పట్టణంలో జరుగుతుందని తెలిసింది. ఆ తర్వాత నెలలోపే ఈ జంట వివాహ బంధంలో అడుగు పెట్టనుంది. డిసెంబర్ 7న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో పెళ్లి చేసుకోనున్నారు.
కృష్ణవంశీ - రమ్యకృష్ణ, గోల్డెన్ బెహల్ - సోనాలి బింద్రే... పెళ్లి చేసుకున్న దర్శకుడు - హీరోయిన్ల లిస్టులో సందీప్ రాజ్ - చాందిని రావు సైతం త్వరలో చేరనున్నారు.
Also Read: హారర్ కామెడీ యూనివర్స్‌లో రష్మిక ప్రేమ కథ... 800 కోట్ల సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత!
Sandeep Raj movies and upcoming movies: 'కలర్ ఫోటో' తర్వాత సందీప్ రాజ్ మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. 'హెడ్స్ అండ్ టేల్స్' వెబ్ సిరీస్, ఇంకా 'ముఖ చిత్రం' సినిమాకు కథలు అందించారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా తన దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు కథ రెడీ చేశారు. ఇంకా మరికొన్ని కథలు ఆయన దగ్గర ఉన్నాయి. రాబోయే ఏడాది (2025లో) ఆయన కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: కిరణ్ అబ్బవరం జర్నీకి నేను నంబర్ వన్ ఫ్యాన్... ట్రోలర్స్‌కు దిమ్మ తిరిగేలా నాగ చైతన్య స్పీచ్