ప్రియాంకా చోప్రా (Priyanka Chopra)... ఇప్పుడు ఆమె హాలీవుడ్ హీరోయిన్. హిందీ సినిమాల కంటే ఇంగ్లీష్ వెబ్ సిరీస్, సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) విషయానికి వస్తే... తమిళ, తెలుగు సినిమాలతో స్టార్ స్టేటస్ అందుకుని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నారు. సమంతకు సలహా ఇవ్వమని అంటే... 'నో' అనేశారు ప్రియాంక! ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


ప్రియాంకా చోప్రాకు, సమంతకు సంబంధం లేదు. ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకునే ప్రాజెక్ట్స్ లేవు. మరి, సమంత ప్రస్తావన ప్రియాంకా చోప్రా దగ్గర ఎందుకు వచ్చింది? సమంతకు ఏం సలహా ఇస్తారని ప్రియాంకను ముంబై మీడియా ఎందుకు అడిగింది? అంటే... 


హిందీ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) కు జోడీగా సమంత నటిస్తున్న వెబ్ సిరీస్ 'సిటాడెల్' (Citadel Web Series). అదే పేరుతో రూపొందుతోన్న హాలీవుడ్ వెబ్ సిరీస్ (Priyanka Chopra Citadel Web Series)కు ఇది ఇండియన్ అడాప్షన్. ఆ కథను తీసుకుని భారతీయ నేటివిటీకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చేసి సిరీస్ తెరకెక్కిస్తున్నారు. 


హాలీవుడ్ 'సిటాడెల్'లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇండియన్ 'సిటాడెల్'లో సమంత చేస్తున్నారు. ఈ నెలాఖరున... ఏప్రిల్ 28న ప్రియాంకా చోప్రా నటించిన 'సిటాడెల్' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది. ఆ సిరీస్ ప్రచారం కోసం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు. 


ఇండియన్ 'సిటాడెల్'లో నటిస్తున్న వరుణ్ ధావన్, సమంతకు మీరు ఏం సలహా ఇస్తారు? అని ప్రియాంకా చోప్రాను అడిగితే... ''వాళ్ళకు నేను ఏమీ సలహా ఇవ్వలేను. ఇద్దరూ మంచి నటులే. ఇటీవల వరుణ్ ధావన్, నేను కాసేపు మాట్లాడుకున్నాం. రెండిటి మధ్య కనెక్షన్స్ గురించి అతడు నాకు చెప్పాడు'' అని సమాధానం ఇచ్చారు. అదీ సంగతి!


సమంత 'సిటాడెల్'కు రాజ్ అండ్ డీకే షో రన్నర్స్ & డైరెక్టర్స్. వాళ్ళు తీసిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'లో సమంత నటించారు. ఆమెకు ఆ సిరీస్ దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకు వచ్చింది. ఆ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ విజయం తర్వాత 'సిటాడెల్'తో వాళ్ళ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది.


Also Read : సినిమాల్లో తెలంగాణ పాటలు.. బ్లాక్ బస్టర్.. బంపర్ హిట్స్


సమంత చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడీగా 'ఖుషి' సినిమాలో నటిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'శాకుంతలం'  ఈ నెల 14న విడుదల కానుంది. ఆ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత 'దిల్‌' రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డిఆర్‌పి (దిల్ రాజు ప్రొడక్షన్స్) - గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మించారు. ఇందులో ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించారు. దుర్వాస మహర్షిగా కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ప్రియంవద పాత్రలో అనన్యా నాగళ్ళ, అదితి బాలన్ పాత్రలో అనసూయ నటించారు. ప్రకాష్ రాజ్, గౌతమి, జిష్షుసేన్ గుప్తా, మధుబాల, కబీర్ బేడీ, సచిన్ ఖేడేకర్, వర్షిణి తదితరులు ఇతర తారాగణం. 


Also Read : ప్రాణం, ప్రపంచం - పిల్లల పేర్లు ప్రకటించిన నయన్, విఘ్నేష్!