Veera Dheera Sooran Part 2 Teaser: మల్టీ టాలెంటెడ్ యాక్టర్, స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇటీవలే ‘తంగలాన్’ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించారు. ఇప్పుడు ‘చిన్నా’ సినిమా తీసిన ఎస్.యూ.అరుణ్ కుమార్ దర్శకత్వంలో ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ (Veera Dheera Sooran Part 2) అనే సినిమాలో నటిస్తున్నారు. తమిళనాట ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి, ముంబైకర్, థగ్స్, మురా వంటి చిత్రాలను నిర్మించిన హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్ మీద రియా శిబు ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ సినిమాను నిర్మిస్తున్నారు.



టీజర్‌లో ఏం ఉంది?
కిరాణ కొట్టులో హీరో విక్రమ్ ఉండటం, సరుకుల కోసం మహిళ రావడం, తన కూతురి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. మెల్లిగా అడుగు అంటూ హీరో అనడంతో చాలా స్మూత్‌గా సాఫ్ట్‌గా ఈ టీజర్ స్టార్ట్ అవుతుంది. జాలీగా తన ఫ్యామిలీతో కలిసి తిరుగుతున్న విక్రమ్... వెంటనే గన్‌తో విధ్వంసం సృష్టించడం కూడా టీజర్‌లో చూడవచ్చు.  అలా విక్రమ్ పాత్రలోని రెండు కోణాల్ని టీజర్‌లో చూపించారు మేకర్స్. ఇక పోలీస్ ఆఫీసర్‌గా ఎస్.జే సూర్య ఈ చిత్రంలో చాలా కొత్తగా కనిపించబోతోన్నారు. ఈ టీజర్‌లో విక్రమ్, ఎస్ జే సూర్య, సూరజ్ వెంజారమూడు, దుషార విజయన్‌ బాగా హైలెట్ అయ్యారు. ‘రాయన్’తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న దుషార విజయన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే హీరోయిన్ క్యారెక్టరా? లేకపోతే ఇంకేదైనా పాత్రనా అన్నది తెలియరాలేదు.


Also Read : అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?


ఇప్పటికే ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’కు సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం సినిమా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్‌ను సాధించి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్‌లో చియాన్ విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ అభిమానుల అంచనాలను మించిపోయాయి. ఇందులో చియాన్ విక్రమ్ డిఫరెంట్ లుక్స్, ఎస్.జె సూర్య నటనకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కేలా ఉంది. 


ఒక్క టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యేలా చేయడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. విక్రమ్, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజారమూడు, దుషార విజయన్ నటించిన ఈ సినిమాకు తేని ఈశ్వర్  సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జీకే ప్రసన్న ఎడిటింగ్, సీఎస్ బాలచందర్ ఆర్ట్ డైరెక్షన్‌ చేయనున్నారు. ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ వచ్చే ఏడాది జనవరిలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.



Also Readబంజారా హిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్