చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా నటించిన సినిమా 'కోబ్రా' (Cobra Movie). ఇందులో 'కెజియఫ్ 2' (KGF 2 Movie) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. ఇటీవల చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. అందులో తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలకు విక్రమ్ సమాధానం కూడా ఇచ్చారు.  సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మన్స్ హైలైట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన ఎందుకంటే... మరోసారి 'కోబ్రా వాయిదా పడిందని చెన్నై టాక్. 


ఆగస్టు 11న 'కోబ్రా'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని భావించడంతో ఆ తేదీన సినిమా విడుదల కావడం లేదని టాక్. విడుదల వాయిదా వేశారని చెన్నై ఖబర్. మళ్ళీ షూటింగ్ చేయాల్సిన అవసరం లేదని, స్క్రీన్ ప్లే పరంగా కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


Also Read : పుష్పరాజ్‌తో ఫ్యామిలీ మ్యాన్ కలిస్తే?


'కోబ్రా'లో విక్రమ్ సుమారు 20 పాత్రల్లో కనిపిస్తారని టాక్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. ఆల్రెడీ రెండు మూడుసార్లు వాయిదా పడింది. అయితే... మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్'తో క్లాష్ అవుతుందా? అని కొందరు సందేహ పడుతున్నారు. సెప్టెంబర్ 30న ఆ సినిమా విడుదల కానుంది. అయితే... ఆ తేదీన 'కోబ్రా' విడుదల కాదని యూనిట్ అంటోందట. మరి, ఎప్పుడు విడుదల అవుతుందో? కొత్త తేదీ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.  


Also Read : 'ఆర్ఆర్ఆర్'లో పులితో ఎన్టీఆర్ ఫైట్ - వీఎఫ్ఎక్స్‌కు ముందు, తర్వాత