Chiranjeevi's Vishwambhara Release Date Locked : మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవెయిటెడ్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ విశ్వంభర. 'బింబిసార' ఫేం వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించిన ఈ మూవీ సమ్మర్‌కు రిలీజ్ అవుతుందని భావించినా ఆ మూమెంట్స్ లేవు. తాజాగా సినిమా రిలీజ్ డేట్‌పై సరికొత్త బజ్ వినిపిస్తోంది.

Continues below advertisement

రిలీజ్ డేట్ అదేనా?

ఈ మూవీ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తాజాగా ఈ డేట్ ట్రెండ్ అవుతుండగా... దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. సినిమాలో చిరు సరసన సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటించారు. అలాగే, 'నా సామిరంగ' ఫేం ఆషికా రంగనాథ్ మరో హీరోయిన్‌గా నటించారు.

Continues below advertisement

కునాల్ కపూర్ విలన్ రోల్ చేస్తుండగా... ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కీలకపాత్రలు పోషించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read : ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్ ఆలస్యం! - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?

మెయిన్ రీజన్... VFX వర్క్స్

ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా VFX వర్క్స్ వల్లే ఆలస్యం అవుతుందని సమాచారం. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, సాంగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుండగా... టీజర్ వీఎఫ్ఎక్స్ వర్క్స్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. క్వాలిటీ బాగా లేదంటూ ట్రోలింగ్ సాగింది. ఈ క్రమంలో ఫారిన్ సంస్థలకు ఈ వర్క్ అప్పచెప్పగా... రూ.75 కోట్లు కేటాయించినట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్స్‌పై డీవోపీ చోటా కె నాయుడు రియాక్ట్ అయ్యారు. 

విశ్వంభర మూవీకి CG వర్క్ పీక్స్‌లో ఉంటుందని... అందుకే చాలా టైం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇది బెస్ట్ ఫిల్మ్ అవుతుందని అన్నారు. దీంతో గ్రాఫిక్స్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. యమలోకం నుంచి సత్యలోకం వరకూ అన్నీ లోకాలను చూపిస్తూ... ఓ యోధుడి కథను తెరపై ఆవిష్కరించినట్లు రీసెంట్ గ్లింప్స్ బట్టి తెలుస్తోంది. మారణ హోమం, హింస, యుద్ధంతో అలసి విసిగి వేసారిన ఓ సమూహాన్ని రక్షించేందుకు వచ్చిన ఓ వీరుడి కథే విశ్వంభర అని సమాచారం. త్వరగా VFX వర్క్స్ పూర్తి చేసి ఈ డేట్‌కైనా మూవీ రిలీజ్ చేసేలా చూడాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.