Megastar Chiranjeevi Conferred With Padma Vibhushan:మెగాస్టార్ చిరంజీవి తాజాగా పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నాడు. నేడు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ చిరంజీవిని వరించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో చిరంజీవిని పద్మ విభూషణ్ వరించింది.
ఈ నేపథ్యంలో ఇవాళ (మే 9న) దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా కొద్దిసేపటి క్రితం పద్మ విభూషణ్‌ను అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసి మెగా ఫ్యాన్స అంతా సంబరాలు చేసుకుంటున్నారు.
చిరు పద్మ విభూషణ్ అందుకుంటున్న వీడియోను ఫ్యాన్స్ పేజీలో షేర్ చేస్తూ "మన తెలుగు సినిమా గర్వించదగ్గ మెగాస్టార్ చిరంజీవి గారు భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్నారు" అంటూ మురిసిపోతున్నారు. దీంతో సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిరుతో పాటు నృత్యకారిణి, సీనియర్ నటి వైజయంతిమాల బాలి కూడా పద్మ విభూషణ్ అవార్డ్ అందుకున్నారు. కాగా ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి చిరంజీవి నిన్న భార్య సురేఖ, కుమారుడు రామ్ చరణ్, కోడల ఉపాసనతో కలిసి స్పెషల్ ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో చిరు పద్మ విభూషణ్ అందుకుంటున్న క్రమంలో రామ్ చరణ్ ఎమోషల్ అవుతూ కనిపించాడు.
Also Read: ఏపీ రాజకీయాలపై అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్ - తన మద్దతు ఆయనకేనని వెల్లడి