Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు... IIFA వేడులో అందజేసిన బాలీవుడ్ ప్రముఖులు

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. దుబాయ్ వేదికగా జరిగిన IIFA వేడులో ఆయనను 'ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' అవార్డుతో సత్కరించారు.

Continues below advertisement

Megastar Chiranjeevi Honoured with Outstanding Achievement Award: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అవార్డుల లిస్టులో మరో ప్రతిష్టాత్మక అవార్డు వచ్చేసింది. భారతీయ సినీ రంగాన్ని ఆయన చేస్తున్న సేవకు గాను IIFA 2024 నిర్వాహకులు ప్రతిష్టాత్మక 'ఔట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారాన్ని అందజేశారు. దుబాయ్ వేదికగా జరిగిన IIFA వేడుకలో ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ, ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్‌ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలు నందమూరి బాలయ్య, దగ్గుబాటి వెంకటేష్ స్టేజి మీదకు వచ్చి మెగాస్టార్ ను అభినందించారు. ఆయనను ఆలింగనం చేసుకుని ఫోటోలకు పోజులిచ్చారు. టాలీవుడ్ స్టార్ హీరోలను ఒకే వేదికపై చూసి ఈ వేడుకలో పాల్గొన్న వాళ్లంతా సంతోషంతో చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు చెప్తున్నారు.    

Continues below advertisement

ఈ అవార్డులో వారికీ భాగస్వామ్యం ఉంది- చిరంజీవి

IIFA ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్న తర్వాత చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు లభించిన ఈ అవార్డులో అభిమానులకూ భాగస్వామ్యం ఉంటుదని చెప్పుకొచ్చారు. “తెలుగు సినిమా పరిశ్రమకు, అభిమానులకు ధన్యవాదాలు. అభిమానుల మద్దతు కారణంగానే ఈ రోజు నాకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు కేవలం నా కృషికి మాత్రమే కాదు.. అభిమానుల నుంచి నాకు లభించిన ప్రేమ, ప్రోత్సాహానికి నిదర్శనం. వారు నా మీద చూపిస్తున్న అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని చెప్పుకొచ్చారు. ఆయన మాటలకు వేడుకలో పాల్గొన్న వాళ్లంతా లేచి నిల్చొని కరతాళ ధ్వనులు చేశారు.

దుబాయ్ వేదికగా అట్టహాసంగా IIFA అవార్డుల వేడుక

సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే IIFA 2024 అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. దుబాయ్ వేదికగా నిర్వహించిన ఈ వేడుకలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. టాలీవుడ్ స్టార్స్ రానా దగ్గుబాటి, తేజ సజ్జా హోస్ట్ చేసిన ఈ ఈవెంట్ నాజర్, బ్రహ్మానందం, ప్రియదర్శన్, ప్రియమణి, జయ రామన్, శరత్‌ కుమార్, రాధిక, వరలక్ష్మి, కరణ్ జోహార్‌ తో పాటు పలువురు సినీ దిగ్గజాలు పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో టాలీవుడ్ నటి సమంత ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకుంది.

‘విశ్వంభర’ షూటింగ్ లో మెగాస్టార్ బిజీ

అటు చిరంజీవి ప్రస్తుతం  ‘విశ్వరంభర’ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ సోషియో ఫాంటసీ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిఆమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

Read Also: కృతి సనన్ to రెజీనా... ఐఫా 2024 రెడ్ కార్పెట్ మీద అందాల భామల హొయలు

Continues below advertisement