Ram Charan Received Honorary Doctorate From Vels: మెగా హీరో రామ్‌ చరణ్‌ (Ram Charan) ఇకపై డా.రామ్‌ చరణ్‌ అయిపోయాడు. చెన్నై వేల్స్‌ యూనివర్సిటీ (vels university) ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు (ఏప్రిల్‌ 13) వేల్స్‌లో జరిగిన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలో భాగంగా చరణ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. తాజాగా చరణ్‌ ఈ అరుదైన గౌరవం దక్కడంతో మెగాస్టార్‌ చిరంజీవి ఎమోషనల్‌ (Chiranjeevi Emotional Post) అయ్యారు. చరణ్‌కు వేల్స్‌ యూనివర్సిటీ ప్రముఖులంతా గౌరవ డాక్టరేట్‌ అందిస్తున్న వీడియోను చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్బంగా ఒక తండ్రికి ఇంతకంటే ప్రౌడ్‌ మూమేంట్‌ ఏముంటుందంటూ ఎమోషనల్‌ అయ్యారు.


ఇది చెప్పలేని ఆనందం, ఉత్సాహకరమై క్షణం


"ప్రసిద్ధ విద్యాసంస్థ, తమినాడు వేల్స్‌ యూనివర్సిటీ రామ్‌ చరణ్‌కు (@alwaysramcharan) గౌరవ డాక్టరేట్‌ అందించడం తండ్రిగా నేను గర్వపడుతున్నాను. నిజంగా నాకు ఇది ఓ ఎమోషనల్‌ అండ్‌ ప్రౌడ్‌ మూమెంట్‌. అలాగే చెప్పలేని ఆనందం, ఉత్సాహకరమైన క్షణం. తమ సంతానం విజాయాలను అధిగమించినప్పుడ ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే నిజమైన ఆనందం ఏముంటుంది. అప్పుడు, ఇప్పుడు.. ఎప్పుడూ అది రామ్‌ చరణ్‌ స్థిరత్వంతో చేస్తున్నాడు! లవ్‌ యూ మై డియర్‌ డా. రామ్‌ చరణ్‌" అంటూ తండ్రిగా చిరంజీవి గర్వపడ్డారు. ప్రస్తుతం ఆయన పోస్ట్‌ నెటిజన్లు బాగా ఆకట్టుకుంటుంది. ఇది చూసి మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. ఇక నిజంగా చరణ్‌ తండ్రికి దగ్గ తనయుడి అని, ఇదోక భావోద్వేగా క్షణం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక చరణ్‌ డాక్టరేట్‌ అందుకోవడంతో అంతా అతడికి విషెస్‌ తెలుపుతున్నారు. 










కాగా చలనచిత్ర రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గానూ రామ్‌ చరణ్‌కు వేల్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించిన నేడు ప్రదానం చేసింది. ఈ నేపథ్యంలో చరణ్‌ నేడు భార్య ఉపాసన, కూతురు క్లింకారతో కలిసి చెన్నైలో వెళ్లారు. తాజాగా చరణ్‌ డాక్టరేట్‌ అందుకున్న వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(AICTC) అధ్యక్షుడు డీజీ సీతారాం పాల్గొని చరణ్‌కు డాక్టరేట్‌ అందించారు. ఇప్పటికే 'గ్లోబల్‌ స్టార్‌' గుర్తింపు పొందిన చరణ్‌ తాజాగా మరో అరుదైన ఘనతను అందుకోవడంతో మెగా ఫ్యాన్స్‌ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం గేమ్ ఛేంజర్, ఆర్ సీ 16(#RC16) చిత్రాలు చేస్తున్నాడు. 


Also Read: 'హనుమాన్' చేయాలన్నది నా కల, తేజ సజ్జపై చిరు కామెంట్స్‌ - ఎమోషనలైన ప్రశాంత్‌ వర్మ