Chiranjeevi Comments on Teja Sajja and Hanuman Movie: మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్‌కి 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన చిరంజీవి 'హనుమాన్' లాంటి సినిమా చేయాలనేది తన డ్రీమ్ అని, కానీ.. ఆ సినిమాను తేజ సజ్జ చేసేశాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఇక చిరంజీవి కామెంట్స్‌పై ప్రశాంత్ వర్మ స్పందిస్తూ ఎమోషన్ పోస్ట్ షేర్ చేశాడు. చిరంజీవి గారు తన చిత్రం హనుమాన్‌పై చేసిన కామెంట్స్ ఇంకా తన బాధ్యతను పెంచాయంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మేరకు చిరంజీవి మాట్లాడిన వీడియో కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ పోస్ట్ వైరల్ అవుతుంది.
నా సినిమాలు చూస్తూ పెరిగాడు
ఇంతకి అసలేం జరిగిందంటే. ఓ ఈవెంట్‌కు చిరంజీవి స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యాడు. అలాగే కొందరు నటీనటులు, 'హనుమాన్'' హీరో తేజ సజ్జ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షో హోస్ట్ చిరుని ఇలా ప్రశ్నించాడు. చాలామంది నటీనటులు మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాల్లో నటిస్తారని ప్రశ్నిస్తే చాలామంది నటీనటులు మీ సినిమాలు పేర్లు చెబుతుంటారు. అలా మీకు ఇలాంటి సినిమాలో నటించాలనే ఆశ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి చిరు మాట్లాడుతూ.. "హా ఉంది. అది చెప్పేముందు మీకు ఒక విషయం చెప్తాను. అక్కడ జాకేట్ వేసుకుని కూర్చున్న అబ్బాయి(తేజ సజ్జను ఉద్దేశిస్తూ). హనుమాన్ మూవీ చేశాడు. 25 ఏళ్ల క్రితం నా సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరిర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత నా మరో చిత్రం ఇంద్రలోనూ చేశాడు. అతడికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. అప్పటి నుంచి నా సినిమాలు చూస్తూ, నన్ను స్ఫూర్తిగా తీసుకుని పెరిగాడు.
హనుమాన్ నా డ్రీమ్ ప్రాజెక్ట్: చిరంజీవి
కానీ, ఇప్పుడు అతడు 'హనుమాన్' మూవీ చేసి హను-మ్యాన్ అయిపోయాడు. అయితే, హనుమాన్ లాంటి సినిమా నేను చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఇతను ఆ సినిమా చేశాక. నేను చాలా డ్రీం ఫుల్‌ఫిల్ అయ్యింది. అతన్ని అలా చూసి నేను చాలా సంత్రప్తి చెందాను. ఎందుకంటే నేను తనని వేరుగా చూడటం లేదు. అతడు నా ప్రయాణంలో ఒక భాగం. ఇప్పుడు తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇండియా మొత్తం అతడిని మెచ్చుకుంటుంది" అంటూ చిరు చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఇదే వీడియో క్లిప్‌ని ప్రశాంత్ వర్మ షేర్ చేస్తూ.. "పద్మవిభూషన్ చిరంజీవి గారి లాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ హనుమాన్ అనే మాటకంటే ఇంకా గొప్పది ఏముందుంటుంది. ఆయన మాటలు నా బాధ్యతను మరింత పెంచాయి. ఈ మెగా మాటలను నా జీవితం గుర్తుపెట్టుకుంటాను. అలాగే వాటిని ఎప్పటికి గౌరవిస్తూ నిలబెట్టుకుంటాను. ఈ వీడియో చూస్తూ నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఇక స్వయంగా అనుభూతి చెందిన తేజ సజ్జ పరిస్థితి, భావన ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను." అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.