'కుబేర' విడుదలైన తర్వాత ప్రతి ఒక్కరి నోటా వినిపించే మాట... ధనుష్ మరోసారి నేషనల్ అవార్డు కొడతారని! గుబురు గెడ్డం పెంచుకుని, ఆ క్యారెక్టర్ కోసం ఆల్మోస్ట్ ఎనిమిది కిలోలు బరువు తగ్గి, తిరుపతి వీధుల్లో బిచ్చగాడిగా పరుగులు తీసే సాహసం స్టార్ హీరోలు ఎవరూ చేయరు. అసలు ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు అయితే... అందులో జీవించడం మరో ఎత్తు. 

సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు ధనుష్ కాకుండా బిచ్చగాడు మాత్రమే కనిపించేలా దేవా పాత్రలో నటించారు. అందుకే అతనికి నేషనల్ అవార్డు రావాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 'కుబేర' సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి కూడా ధనుష్ నటనకు నేషనల్ అవార్డు రావాలని కోరారు. 

అవార్డు రాకపోతే అర్థమే లేదు...చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్!Chiranjeevi on National Award: 'కుబేర'లో నటనకు గాను ధనుష్ తప్పకుండా నేషనల్ అవార్డు అందుకోవాలని, ఒకవేళ అతనికి గనుక అవార్డు రాకపోతే నేషనల్ అవార్డులకు విలువ ఉండదని మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

Also Read: సెంట్రల్‌లో బీజేపీ మంత్రికి సెన్సార్ షాక్... ఈ వారం సినిమా రిలీజ్ లేనట్టేనా?

చిరంజీవి వేదిక మీదకు వెళ్ళడానికి ముందు, ఆయన ఆడిటోరియానికి వచ్చిన తర్వాత కాళ్లకు నమస్కరించారు ధనుష్. కళా దర్శకుడు తోట తరణి కాళ్లకు సైతం నమస్కరించారు. నాగార్జునను మాట్లాడమని యాంకర్ స్టేజి మీదకు పిలిస్తే... తన తర్వాత నాగార్జున మాట్లాడని, అదే పద్ధతి అంటూ ధనుష్ స్టేజి మీద వెళ్లారు. తన కంటే పెద్దలకు ధనుష్ ఇచ్చే గౌరవం 'కుబేర' సక్సెస్ మీట్‌లో ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది.

Also Readబీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్... ఫోటోలు చూడండి

అప్పుడు 'పుష్ప'కు అల్లు అర్జున్...ఇప్పుడు 'కుబేర'కు తప్పకుండా ధనుష్!'పుష్ప' సినిమాకు అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవాలని ఆశించానని, తన కోరిక ఫలించిందని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు 'కుబేర' సినిమాకు ధనుష్ తప్పకుండా నేషనల్ అవార్డు అందుకోవాలని ఆశిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. నాగార్జున సైతం నేషనల్ అవార్డులు ధనుష్‌కు కొత్త కాదని, ఈ సినిమాతో మరోసారి అతడు నేషనల్ అవార్డు కొడతాడన్నట్టు చెప్పారు. నెక్స్ట్ నేషనల్ అవార్డుల రేసులో ధనుష్ పేరు ముందు వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.