మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒరిజినల్ పేరు ఏమిటో తెలుసు కదా!? కొణిదెల శివ శంకర వరప్రసాద్. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న సినిమాలో శివ శంకర్ వరప్రసాద్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. చిరు ఒరిజినల్ పేరును సినిమాలో హీరో పేరు చేశారు అనిల్ రావిపూడి. మరి ఆ వరప్రసాద్ ఏం చేస్తాడో తెలుసా? 

స్కూల్‌లో డ్రిల్ మాస్టర్... చిరు రోల్ ఇదే!Chiranjeevi role in Mega 157 movie: మెగా 157లో స్కూల్ డ్రిల్ మాస్టర్ శివశంకర వరప్రసాద్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మస్సూరీలో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఒక పాఠశాలలో చిరంజీవి సహా ఇతర ప్రధాన తారాగణం మీద కీలకమైన టాకీ పార్ట్ షూటింగ్ చేస్తున్నారు.

Also Read: పవన్ సన్నిహితులే టార్గెట్... జగన్ కోసం సినిమా ఇండస్ట్రీనీ వదల్లేదు..‌. ఆ సెలబ్రిటీలు ఫోన్ ట్యాపింగ్ బాధితులే!?

చిరంజీవితో పాటు చిత్రీకరణలో నయన్!Nayanthara joins Chiranjeevi - Anil Ravipudi's Mega 157 shooting in Mussoorie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న సంగతి తెలిసింది. 'సైరా నరసింహారెడ్డి'లో వాళ్ళిద్దరూ జంటగా నటించారు.‌ ఆ తర్వాత 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరు సిస్టర్ రోల్ చేశారు నయన్. ఇప్పుడు మరోసారి చిరు - నయన్ జంటగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముస్సూరీలో జరుగుతున్న చిత్రీకరణలో నయనతార కూడా జాయిన్ అయ్యారు. ఆవిడతో పాటు మరొక హీరోయిన్ కేథరిన్ కూడా షూటింగ్ చేస్తున్నారు. 

Also Readపవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?

'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ విజయం తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, అందులోనూ‌ మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మొదటి సినిమా కావడంతో మెగా 157 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవిది టిపికల్ కామెడీ టైమింగ్. ఆయన వినోదాత్మక పాత్రలు చేసిన ప్రతిసారి విజయాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కేథరిన్, వీటీవీ గణేష్, 'బలగం' మురళీధర్ గౌడ్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి - సుస్మిత కొణిదెల, నిర్మాణ సంస్థలు: షైన్ స్క్రీన్స్ - గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ: శ్రీమతి అర్చన, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్: ఎ.ఎస్. ప్రకాష్, కూర్పు: తమ్మిరాజు, రచయితలు: ఎస్ కృష్ణ - జి ఆది నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ.