మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా ఆయన వీరాభిమాని బాబీ కొల్లి (Director Bobby Kolli) దర్శకత్వంలో మరో సినిమా ప్రకటన వచ్చింది. 'వాల్తేరు వీరయ్య' తర్వాత మరోసారి ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. చిరు 158వ సినిమా కనుక Mega 158 అని వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా నేపథ్యం తెలుసా?
బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో చిరు బాబీ సినిమా!?Chiranjeevi Bobby Kolli Movie Backdrop Details: బెంగాల్ నేపథ్యంలో చిరంజీవి - బాబీ కొల్లి కొత్త సినిమా కథ ఉండబోతుందా? అంటే 'అవును' అని చెప్పవచ్చు. వై? ఎందుకు? అంటే... చిరు పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు కదా! అందులో ఓ గొడ్డలి ఉంది. ఆ గొడ్డలి మీద "বংশে আসছে" అని రాసి ఉంది. అది బెంగాలీ లిపి. ఆ అక్షరాలకు మీనింగ్ ఏంటో తెలుసా? 'వంశంలోనే ఉంది లేదా రక్తంలో ఉంది' అన్నట్టు!
Also Read: మహేష్ అన్న కొడుకు... బాలీవుడ్ హీరోయిన్ కూతురు... తెలుగు తెరకు జంటగా!
చిరు బాబీ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్!Thaman to compose music for Chiranjeevi Bobby's Mega 158: చిరంజీవి - బాబీ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నారు. 'వాల్తేరు వీరయ్య'కు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహించిన 'డాకు మహారాజ్'కు తమన్ మ్యూజిక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను రిపీట్ చేస్తున్నారు బాబీ.
చిరు - బాబీ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణ, లోహిత్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఇన్‌స్టాగ్రామ్‌లో లోహిత్ కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలోని 'మన శంకర వరప్రసాద్' పూర్తి చేసే పనిలో ఉన్నారు చిరంజీవి. ఆ సినిమా పూర్తి అయ్యాక బాబీ సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్, ఇతర నటీనటులు - సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read: 'పరదా'కు భారీ షాక్... లక్షల్లో ఓపెనింగ్ డే కలెక్షన్లు - అనుమప కష్టం వృథాయేనా?