Chiranjeevi Anil Ravipudi Movie Update: మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటేనే ఆ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్ అంటే హైప్ రెండింతలు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. చిరంజీవి, నయనతారలపై కీలక సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

అనిల్ ప్లాన్ మామూలుగా లేదంతే..

ఈ మూవీపై మరో లేటెస్ట్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లైమాక్స్ సీన్ కోసం డైరెక్టర్ అనిల్ భారీగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇందు కోసం ఓ భారీ సెట్‌ను వేస్తున్నారట. ఈ సీన్ సినిమాకే హైలెట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. అలాగే.. వచ్చే వారం జరగబోయే షెడ్యూల్‌లో నయనతార, చిరంజీవిలపై ఫ్యామిలీ సీన్స్, కామెడీ ఎపిసోడ్స్ షూట్ చేయబోతున్నట్లు సమాచారం.

చిరు రోల్ ఏంటో?

చిరు రోల్ ఏంటనే దానిపై మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ మూవీ కామెడీ ఎంటర్‌టైనర్ అని, అభిమానులకు కచ్చితంగా నచ్చుతుందని పలు సందర్భాల్లో మెగాస్టార్ చెప్పారు. దీంతో ఆయన్ను హ్యుమరస్ క్యారెక్టర్‌లో చూపిస్తారనే ప్రచారం సాగుతుండగా.. ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో చిరు అసలు పేరు శివశంకర్ వరప్రసాద్‌గానే కనిపించనున్నారు.

ఆయన 'రా' ఏజెంట్‌గా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ తర్వాత చిరు సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు నయనతార. మరో హీరోయిన్ కూడా సినిమాలో కనిపిస్తారనే రూమర్ వినిపిస్తుండగా.. ఆమె ఎవరనేది ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన  రాలేదు. మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుష్మిత నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: ఆడవాళ్ల ప్రేమకు సాక్ష్యాలు.. మనసులో సమాధి చేసుకున్న జ్ఞాపకాలే.. - ఆసక్తికరంగా '8 వసంతాలు' ట్రైలర్

వెంకీ కీలక రోల్

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక రోల్ చేయబోతున్నారనే టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మరి దీనిపై ఎలాంటి ప్రకటన లేదు. ఒకవేళ వెంకీ ఈ మూవీలో ఉంటే ఆయన రోల్ ఏంటి?, 'రా' ఏజెంట్‌గా కనిపించబోతున్న చిరంజీవికి, ఆయనకు మధ్య ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

'సంక్రాంతికి వస్తున్నాం' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడికి మెగాస్టార్‌తో ఇదే ఫస్ట్ మూవీ. తన కెరీర్‌లో వరుస హిట్స్ అందుకున్న చిరంజీవితోనూ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ దగ్గర నుంచీ నటీనటులు, ఇతర టీం ఇంట్రడ్యూస్ వరకూ అనిల్ సరికొత్తగా ప్లాన్ చేశారు. చిరు పేరుపేరునా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లగా.. వారిని వారు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వారి రోల్స్ చెప్పిన వీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీం ప్లాన్ చేస్తోంది. ఇక చిరంజీవి హీరోగా వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వంభర' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.