చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్ - Chimata Ramesh Babu) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'నేను - కీర్తన' (Nenu - Keerthana Movie). ఇందులో రిషిత, మేఘన కథానాయికలు. తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, 'రజాకర్' దర్శకుడు యాటా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం జరిగింది.


'నేను - కీర్తన' టీజర్ ఎలా ఉందంటే?
'నేను - కీర్తన' టీజర్ చూస్తుంటే... పల్లెటూరి నేపథ్యంలో లవ్, యాక్షన్, కామెడీ అంశాలు మేళవించి తెరకెక్కించిన కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. ఈ సినిమాలో జీవా రౌడీ రోల్ చేశారు. ''ఫిరంగి గుండు వచ్చి గుండెల మీద పడితే ఎలా ఉంటుందో తెలుసా? నేను గుద్దితే అలా ఉంటుంది'' అని హీరో చిమటా రమేష్ పంచ్ డైలాగ్ చెప్పారు. టీజర్ చూస్తుంటే కొత్త హీరో, దర్శకుడితో కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమాలా లేదని, హీరోగా చిమటా రమేష్ బాబుకు మంచి భవిష్యత్తు ఉందని ముఖ్య అతిథిలు పేర్కొన్నారు. రమేష్ బాబు మల్టీ టాలెంటెడ్ హీరో అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. సినిమా సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు.


Also Read'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, విజయ్ దేవరకొండ తండ్రి సినిమా చూసి ఏమన్నారంటే?



'నేను - కీర్తన' చిత్రాన్ని చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా జ్యోతిర్మయి (అమెరికా) సమర్పణలో చిమటా లక్ష్మీ కుమారి ప్రొడ్యూస్ చేశారు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్ల తాను హీరోగా, దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కించానని, ఇది మల్టీ జోనర్ సినిమా అని రమేష్ బాబు చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది. కులు మనాలిలో షూటింగ్ చేసిన పాటలు, ఆరు ఫైట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతాయి'' అని చెప్పారు. 'నేను - కీర్తన'లో నటించడం చాలా సంతృప్తి ఇచ్చిందని సీనియర్ నటులు విజయ్ రంగరాజు, 'జబర్దస్త్' అప్పారావు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎంఎల్ రాజా, రాజ్ కుమార్, హీరోయిన్ రిషిత తదితరులు పాల్గొన్నారు.


Also Readవిజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్



చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా... రిషిత, మేఘన హీరోయిన్లుగా తెరకెక్కిన 'నేను - కీర్తన' సినిమాలో సంధ్య, జీవా, విజయ రంగ రాజు, 'జబర్దస్త్' అప్పారావు, 'జబర్దస్త్ సన్నీ', రాజ్ కుమార్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి డీఐ: భాను ప్రకాష్, వీఎఫ్ఎక్స్: నవీన్, ఎస్ఎఫ్ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, యాక్షన్ సీక్వెన్సులు: నూనె దేవరాజ్, ఎడిటింగ్: వినయ్ రెడ్డి బండారపు, కొరియోగ్రఫీ: అమిత్ కుమార్ - సి.హెచ్.ఆర్, సంగీతం: ఎంఎల్ రాజా, సినిమాటోగ్రఫీ: కె. రమణ, ప్రజెంటర్: చిమటా జ్యోతిర్మయి (అమెరికా), ప్రొడ్యూసర్: చిమటా లక్ష్మీ కుమారి, రచన - దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్).