Raj Tarun: రాజ్‌ తరుణ్‌కి అమ్మాయిల పిచ్చి - అలాంటి వాడికి శిక్ష పడాల్సిందే, ప్రియురాలు డిమాండ్‌

Raj Tarun Case: రాజ్‌ తరుణ్‌కి శిక్ష పడాలని అతడి ప్రియురాలు లావణ్య డిమాండ్‌ చేస్తుంది. హీరోయిన్‌తో ఎఫైర్‌ వల్ల తనని మోసం చేశాడంటూ రాజ్‌ తరుణ్‌పై అతడి ప్రియురాలు చీటింగ్‌ కేసు పెట్టిన సంగతి తెలిసిందే

Continues below advertisement

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌పై చీటింగ్ కేసు నమోదయ్యింది. తనని నమ్మించి మోసం చేశాడంటూ రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఈ మేరకు నార్సింగ్ పోలీసు స్టేషన్ లో రాజ్ తరుణ్ పై కేసు నమోదైంది. వివరాలు.. రాజ్ తరుణ్ తాను పదకొండు ఏళ్లుగా రిలేషన్ లో ఉన్నట్టు బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.  అంతేకాదు తామిద్దరం రహస్యంగా గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని ఆమె తెలిపింది. అయితే గత మూడు నెలలుగా రాజ్ తరుణ్ తనకు దూరంగా ఉంటున్నాడని బాధితురాలు వాపోయింది. 

Continues below advertisement

కొంతకాలం రాజ్‌ తరుణ్‌ సినీ హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకున్నాడని, ఆమె మాయలో పడి తనను వదిలేశాడని ఆమెఆరోపించింది. అంతేకాదు ఆమెతో రిలేషన్‌లో ఉండటమే కాకుండ తనని వదిలేయాలని ఒత్తిడి చేస్తున్నాడంది. లేదంటే చంపేస్తానంటూ రాజ్ తరుణ్ తనని  బెదిరిస్తున్నాడని చెప్పింది. అతడికి అమ్మాయిల పిచ్చి ఉందని, అలాంటి వాడికి శిక్ష పడేలా చూడాలని బాధితురాలు డిమాండ్‌ చేస్తున్నట్టు పోలీసు అధికారి తెలిపారు. అలాగే అతడి విడిచిపెట్టాలని అతడి‌ కుటుంబ సభ్యులు కూడా బెదిరిస్తున్నారని, రాజ్‌ తరుణ్‌.. అతడి కుటుంబ సభ్యుల వల్ల తనకు ప్రాణహానీ ఉందని సదరు యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్టు నార్సింగ్‌ పోలీసు అధికారికి మీడియాకు వెల్లడించారు. 

Also Read: 'బింబిసార'కు ప్రీక్వెల్ - 'రొమాంటిక్' దర్శకుడితో కళ్యాణ్ రామ్ సినిమా!

 

 

 

 

Continues below advertisement