మమ్ముట్టి 'భ్రమయుగం' చూశారా? అందులో మరో ప్రధాన పాత్ర పోషించిన అర్జున్ ఆశోకన్ (Arjun Ashokan) గుర్తు ఉన్నారా? ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'చఠా పచా - ది రింగ్ ఆఫ్ రౌడీస్' (Chatha Pacha: The Ring Of Rowdies). ఇందులో రోషన్ మాథ్యూ, 'మార్కో' ఫేమ్ ఇషాన్ షౌక్కత్, విశాఖ్ నాయర్, పూజా మోహన్ దాస్ ఇతర ప్రధాన తారాగణం. మలయాళ చిత్ర పరిశ్రమలో WWE జానర్‌లో రూపొందిన మొట్టమొదటి యాక్షన్ కామెడీ చిత్రమిది.
తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్...
మొత్తం 115 దేశాల్లో 'చఠా పచా' విడుదల!
వచ్చే ఏడాది (2026) జనవరిలో 'చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మొత్తం 115 దేశాల్లో విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాను తెలుగులో ప్రముఖ తెలుగు నిర్మాణ - పంపిణీ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
'చఠా పచా - ది రింగ్ ఆఫ్ రౌడీస్' చిత్రానికి నూతన దర్శకుడు అద్వైత్ నాయర్ దర్శకత్వం వహించగా... ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లెన్స్ మన్ గ్రూప్ ఏర్పాటు చేసిన రీల్ వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. రమేష్, రితేష్ రామకృష్ణన్, షిహాన్ షౌక్కత్, ఎస్. జార్జ్, సునీల్ సింగ్ నిర్మాతలు.
మలయాళంలో రిలీజ్ చేస్తున్న దుల్కర్!
'చఠా పచా - ది రింగ్ ఆఫ్ రౌడీస్' సినిమాను కేరళలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ విడుదల చేయనుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాను నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది.
Also Read: 'బాబ్' మహేష్ ఎంట్రీ కోసం అంత ప్లానింగా - రాజమౌళితో మామూలుగా ఉండదు!
తమిళనాడు, కర్ణాటకలో పీవీఆర్ ఐనాక్స్ విడుదల చేస్తుంది. మలయాళంతో పాటు తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. WWE రెజ్లింగ్ స్ఫూర్తితో 'చఠా పచా - ది రింగ్ ఆఫ్ రౌడీస్' తెరకెక్కింది. ఇదొక రెజ్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్. ఫోర్ట్ కొచ్చిలోని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ జానర్ రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో తీశారు. సిద్ధిక్, లక్ష్మీ మీనన్, మనోజ్ కె జయన్, ఖలీద్ అల్ అమెరి, రఫీ, టెస్ని ఖాన్, ముత్తుమణి, కార్మెన్ ఎస్ మాథ్యూ, డి'ఆర్టగ్నన్ సాబు, వైష్ణవే బిజు, శ్యామ్ ప్రకాష్, కృష్ణన్ నంబియార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ త్రయం శంకర్ - ఎహ్సాన్ - లాయ్ స్వరాలు అందించారు. ముజీబ్ మజీద్ నేపథ్య సంగీతం అందించారు.
Also Read: ప్రభాస్‌తో ఐదారు సీన్లు ఇస్తారనుకున్నా, కానీ... 'ది రాజా సాబ్'లో రోల్‌పై మాళవిక ఏమన్నారంటే?