Guntur Kaaram Censor Review: మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజే వేరు. కానీ అలాంటి కాంబినేషన్‌లో ఇప్పటివరకు రెండు సినిమాలే వచ్చాయి. హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిందే ‘గుంటూరు కారం’. అందుకే ఈ హ్యాట్రిక్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఈ సినిమా కోసం చాలాకాలం తర్వాత మాస్ లుక్‌ను కనిపించనున్నాడు మహేశ్ బాబు. దీంతో మహేశ్ మాస్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఫీస్ట్ దక్కుతుందని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా ‘గుంటూరు కారం’ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికర సెన్సార్ రిపోర్ట్ విషయాలు బయటకు వచ్చాయి.


ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే అంశాలు ఎక్కువ..
‘గుంటూరు కారం’ ఫస్ట్ హాఫ్‌కంటే సెకండ్ హాఫ్ బాగున్నట్లు సెన్సార్ రిపోర్ట్స్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్‌పై దృష్టిపెట్టారట త్రివిక్రమ్. దాంతో పాటు కాస్త ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే స్టఫ్ కూడా ఉంటుందట. ఇక సెకండ్ హాఫ్ నుంచి కథ కొంచెంకొంచెంగా రివీల్ అవుతూ.. సెకండ్ హాఫ్‌లోని మొదటి 30 నిమిషాల్లో పూర్తిగా కథలోకి తీసుకెళ్లిపోతుందట ‘గుంటూరు కారం’. మొత్తంగా ఈ మూవీ ఒక మాస్ స్టఫ్‌లాగా ఉంటూ.. ఎమోషనల్ క్లైమాక్స్‌తో ఎండ్ అవుతుందని తెలిసింది. కానీ ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే.. సెకండ్ హాఫ్‌లోనే ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే అంశాలు ఎక్కువగా ఉన్నాయట.


‘అతడు’లాంటి సినిమా..
‘గుంటూరు కారం’ చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించి.. దానికి కాస్త ఫ్యామిలీ టచ్ కూడా యాడ్ చేశారట త్రివిక్రమ్. దీన్ని బట్టి చూస్తే ‘అతడు’లాంటి మరో సినిమా మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇవ్వడానికి వచ్చేస్తుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సెన్సార్ బోర్డ్ ఇచ్చిన రివ్యూను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు సినిమా చూస్తే.. కచ్చితంగా కలెక్షన్స్ విషయంలో ‘గుంటూరు కారం’ ఒక రేంజ్‌కు వెళుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు త్రివిక్రమ్ టేకింగ్, మహేశ్ యాక్టింగ్‌తో పాటు తమన్ మ్యూజిక్ కూడా పెద్ద ప్లస్ కానుంది. ఇప్పటికే తమన్ కంపోజ్ చేసిన మూడు పాటలు విడుదలయ్యి మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.


‘కూర్చీ మడతపెట్టి’ పాటతో కాంట్రవర్సీ..
‘గుంటూరు కారం’ మూవీ నుండి ఇప్పటివరకు మూడు పాటలు విడుదలయ్యాయి. అందులో ముందుగా వచ్చిన ‘దమ్ మసాలా’ పాట అయితే ఫ్యాన్స్‌కు తెగ నచ్చేసింది. కానీ ఆ తర్వాత మహేశ్, శ్రీలీల కాంబినేషన్‌లో వచ్చిన ‘ఓ మై బేబీ’కి మాత్రం మిక్స్‌డ్ రివ్యూలు లభించాయి. ఇక తాజాగా విడుదలయిన ‘కూర్చీ మడతపెట్టి’ సాంగ్‌తో అయితే ఏకంగా కాంట్రవర్సీలే క్రియేట్ అయ్యాయి. మహేశ్‌లాంటి స్టార్ హీరో సినిమాలో అలాంటి పాటలు ఎలా పెడతారు అంటూ కొందరు ఖండించారు. ఇక ‘గుంటూరు కారం’లో మహేశ్‌కు జోడీగా శ్రీలీల నటించగా.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న ‘గుంటూరు కారం’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమయ్యింది.


Also Read: రవితేజ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాలి - ‘ఈగల్’ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన దిల్ రాజు