'శంభో శివ శంభో'తో దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయమైన సముద్రఖని (Samuthirakani), ఆ తర్వాత తెలుగులో నటుడిగా బిజీ అయ్యారు. ఆయనకు జంటగా అభినయ నటించిన సినిమా 'కార్మేని సెల్వం' (Carmeni Selvam Movie). ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) మరొక ప్రధాన పాత్రలో నటించారు. తెలుగు, తమిళ భాషల్లో టీజర్ విడుదల చేశారు.

Continues below advertisement

డబ్బు... ఆశ... ఏం చేశారంటే?Carmeni Selvam Teaser Review In Telugu: ''డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి" అని సముద్రఖని చెప్పే మాటతో టీజర్ ప్రారంభమైంది. కుటుంబ భారంతో చేసే ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలని కొందరు ఆశతో చేసే ప్రయత్నాలను వివిధ కోణాల్లో చూపించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు పట్ల ప్రజల్లో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయనేది చూపించారు.

Also Read: Vishal On Rajendra Prasad: సారీ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ గారూ... ఎంజీఆర్‌ ఇష్యూలో విశాల్ ట్వీట్

Continues below advertisement

ఈఎంఐలు (లోన్లు), క్రెడిట్ కార్డ్ వినియోగదారుల జీవన శైలి, డబ్బు సంపాదన కోసం మనుషులు తీసుకునే నిర్ణయాలు కథలో కీలక పాత్ర పోషించబోతున్నాయని అర్థం అవుతోంది. సముద్రఖనికు భార్య, ఓ కుమారుడు ఉన్నాడు. ఆ కుటుంబ సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని చెప్పవచ్చు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ క్యారెక్టర్ ఏమిటనేది సస్పెన్స్‌లో ఉంచారు. ఇక టీజర్ చివరిలో ''రిచ్ కావాలంటే రిచ్ మనిషిలా ఖర్చు చేయడం నేర్చుకోవాలి… డబ్బు లేకపోతే అప్పు తీసుకుని ఖర్చు చేయాలి'' అని సముద్రఖని చెప్పే డైలాగ్ ఆసక్తి కలిగిస్తోంది.

Also Readస్టార్ హీరోలైనా వీళ్ళిద్దరూ చెప్పింది చేయాల్సిందే... పూరి ఛాన్స్‌తో టాప్ ప్లేసుకు, ఈ అన్నదమ్ములు ఎవరో తెలుసా?

'కార్మేని సెల్వం' సినిమాను పాత్‌ వే ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ రంగరాజులు నిర్మిస్తున్న చిత్రమిది. రామ్ చక్రి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందింది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తీక్ కుమార్, బడవ గోపీ, కోదండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ ఇతర ప్రధాన తారాగణం. తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 3న విడుదల చేస్తున్నారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ థియేటర్లలో విడుదల చేస్తోంది.

Also ReadVaralaxmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ vs సాయి మాధవ్ బుర్రా: 'సరస్వతి' వివాదం... కథను మార్చారా? అసలు ఏం జరిగింది?