Parineeti Chopra Welcomes Baby Boy With Her Husband Raghav Chadha: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. పరిణీతి చోప్రా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా శుభవార్తను షేర్ చేశారు. 'ఈ క్షణం మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. ఇప్పటివరకూ మేం ఒకరికి ఒకరం ఉన్నాం. ఇప్పుడు మా సర్వస్వం కూడా వీడే.' అంటూ రాసుకొచ్చారు.

Continues below advertisement

దీంతో పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు విషెష్ చెబుతున్నారు. దీపావళికి సంతోషకరమైన వార్తను చెప్పారంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పరిణీతి చోప్రా 2023 సెప్టెంబరులో వివాహం చేసుకున్నారు. తాము పేరెంట్స్ కాబోతున్నామంటూ ఈ ఆగస్టులో రివీల్ చేశారు. 

Also Read: క్రిస్మస్ బరిలో భూమిక 'యుఫోరియా' - ఒకే రోజు 4 సినిమాలు... బాక్సాఫీస్ వద్ద ఏ బొమ్మ బ్లాక్ బస్టర్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా బంధువుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పరిణీతి చోప్రా 2011లో వచ్చిన 'లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్' మూవీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కిల్ దిల్, గోల్ మాల్ అగైన్, సైనా, కేసరి, ఇష్క్ జాదే, శుద్ధ్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు. 'అమర్ సింగ్ చకీల' మూవీతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఆమె తన యూట్యూబ్ ఛానల్‌ను కూడా స్టార్ట్ చేశారు.