Arjun Rampal Engagement With Gabriella Demetriades : బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ తన ప్రియురాలు గాబ్రియెల్లా డెమిట్రియాడ్స్‌తో నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్‌లో ఉన్న వీరు తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.
అతనికి 53... ఆమెకు 38...
53 ఏళ్ల వయసులో అర్జున్ రాంపాల్ 38 ఏళ్ల తన ప్రేయసితో పెళ్లికి రెడీ అవుతున్నారు. ఎలాంటి హడావిడి లేకుండానే సింపుల్‌గా పాడ్ కాస్ట్‌లో తనకు గాబ్రియెల్లాతో ఎంగేజ్మెంట్ జరిగినట్లు చెప్పాడు అర్జున్. ఈ వీడియో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. 'పట్టణంలోని కూల్ జంటకు అభినందనలు' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.
'ప్రేమ షరతులతో వస్తుంది. ఓ వ్యక్తి నిర్దిష్టంగా సరైన మార్గంలో ప్రవర్తిస్తే వారికి నా ప్రేమ లభిస్తుంది. అతను హాట్‌గా ఉన్నాడు కాబట్టి నేను అతని వెంట పడలేదు.' అంటూ గాబ్రియెల్లా చెప్పగా... దీనికి రాంపాల్ రియాక్ట్ అవుతూ... 'ఆమె హాట్ నెస్ కంటే కొంచెం ఎక్కువ ప్రేమను నేను చూశాను.' అంటూ చెప్పాడు. 'మేము నిశ్చితార్థం చేసుకున్నాం. పెళ్లి కూడా చేసుకుంటామేమో...' అంటూ ఇద్దరూ చెప్పడంతో త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
అర్జున్ రాంపాల్‌కు 1998లోనే మోడల్ మెహర్ జెసియాతో పెళ్లయింది. ఈ కపుల్‌కు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2018లో వీరిద్దరూ డివోర్స్ తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం పరస్పర గౌరవం ఆధారంగా తీసుకున్నట్లు తెలిపారు. 2019లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.
ఆ తర్వాత రాంపాల్ గాబ్రియెల్లాతో లవ్ కొనసాగించారు. సౌతాఫ్రికాలో జన్మించిన గాబ్రియెల్లా ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్. భారత్‌కు వచ్చి పలు మ్యూజిక్ వీడియోల్లో నటించారు. అలా సినిమా ఛాన్సెస్ దక్కించుకుని తన టాలెంట్‌తో మెప్పించారు. బాలీవుడ్ మూవీ 'ఇష్క్ ఝమేలా' అర్జున్ - గాబ్రియెల్లా కలిసి నటించారు. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి తిరిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అనౌన్స్ చేశారు.
బాలీవుడ్‌లో ఎన్నో మూవీస్‌లో నటించిన అర్జున్ రాంపాల్ తెలుగులో 'భగవంత్ కేసరి' మూవీలో నెగిటివ్ రోల్‌లో 'రాహుల్ సంఘ్వి'గా కనిపించారు. ఆయనకు తెలుగులో ఇదే ఫస్ట్ డెబ్యూ మూవీ. ఆ తర్వాత పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో ఔరంగజేబు పాత్రను ఆయనే పోషిస్తారని అనుకున్నారు. అయితే, కొన్ని కారణాలతో అర్జున్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో బాబీ డియోల్ ఆ రోల్ చేశారు. ఇక రీసెంట్ హిట్ మూవీ 'ధురంధర్'లో మేజర్ ఇక్బాల్‌గా నటించారు.