Pawan Kalyan's Ustaad Bhagat Singh Dheklenge Song Lyrics : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి బిగ్ ట్రీట్ వచ్చేసింది. వింటేజ్ పవన్‌ను గుర్తు చేసేలా ఆయన వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. 'దేఖ్ లేంగే సాలా... చూసినాము చాలా' అంటూ సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం వేరే లెవల్ కాగా... భాస్కర భట్ల లిరిక్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను ఊపేస్తున్నాయి. 'విశాల్ ధడ్లానీ', హరిప్రియ పాటను పాడారు. ట్రెండింగ్ సాంగ్ లిరిక్స్ ఓసారి చూస్తే...
ట్రెండింగ్ 'దేఖ్‌లేంగే' సాంగ్ లిరిక్స్
పల్లవి
రంపంపమ్ రంపంపమ్... స్టెప్పేస్తే భూకంపమ్
ధమ్ ధమ్ ధమ్ రిధమ్ రిధమ్ ధమ్..
ఫ్లోరు మీద హోరు గాలి రప్పిద్దామ్..
హే బే ఆఫ్ బెంగాల్ పొంగుతున్నా... రే ఆఫ్ హోపే తగ్గుతున్నా...
టగ్ ఆఫ్ వారే జరుగుతున్నా... టేకాఫ్ లేటయ్యినా...
దేఖ్‌లేంగే సాలా... చూసినాంలే చాలా...
దేఖ్‌లేంగే సాలా... చూసినాంలే చాలా...
చరణం 1
నీ పెదవిలోన ఉన్న జాగా... నువ్వు నవ్వుకోవడానికేగా...
నీలోంచి కొత్తగా నువ్వే మొలకెత్తగా గుండెల్లో గంతులేగా...
నీ కాలి కింద ఉన్న నేల... నీ సొంతమంటే నమ్మవేలా...
చీకాకు లేని ఓ పీకాకు లాగా నువ్వు చిందేస్తే గోల గోల...
యారో ఏడి నుంచి వచ్చి గుచ్చుకున్నా... న్యారో మైండుగాళ్లు పీక పట్టుకున్నా...
సోలో సంద్రం నిన్ను ముంచుతున్నా... టుమారో మంతోటి బంతొద్దినా...
దేఖ్‌లేంగే సాలా... చూసినాంలే చాలా...
దేఖ్‌లేంగే సాలా... చూసినాంలే చాలా...
చరణం 2
నా హార్ట్ బీటులోకి ఫాస్ట్ బీట్ వచ్చే...
అల్ట్ మేటిగేదో అగ్గిపుట్టుకొచ్చా ఆ దూకుడు గింగిరా కళ్లు తిప్పుతుంటే
పూలతోటలోకి ఈల పాట వచ్చే... ఒంటి మీదకేదో ఉలికిపాటు తెచ్చే...
సిగ్గులు సిగ్గులు సిగ్నలిచ్చుకుంటే...
ప్రాబ్లమ్స్ వస్తే క్యూలు కట్టి... నో ఎంట్రీ అని బోర్డు పెట్టి
పంపించేద్దా చావగొట్టి... పోరాడితే పోయేదేంటీ...
దేఖ్‌లేంగే దేఖ్‌లేంగే దేఖ్‌లేంగే సాలా... చూసినాంలే చాలా...
దేఖ్‌లేంగే సాలా... చూసినాంలే చాలా...
ప్రస్తుతం యూత్ ట్రెండ్‌కు సెట్ అయ్యేలా ఉన్న లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
Also Read : ఓల్డ్ రొమాంటిక్ 'మసక మసక చీకటిలో...' - పాప్ సింగర్ స్మిత ర్యాప్ మిక్స్ విత్ న్యూ ట్రెండ్
చాలా రోజుల తర్వాత పవన్ వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అదరగొట్టారు. పవన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మూవీలో పవన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. పవన్, హరీష్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్' రెండో మూవీ. అంతకు ముందు వచ్చిన 'గబ్బర్ సింగ్' బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మూవీలో పవన్ సరసన రాశీఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. పార్తీబన్ కీలక పాత్ర పోషిస్తుండగా... వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.